తెలంగాణలో ఒక్కసారి గా సైలెంట్ అయిన బీజేపీ ? రీసన్ ఏమై ఉంటుంది!

తెలంగాణలో బీజేపీ గతంలో కంటే బలంగా ఉంది. బీఆర్ఎస్ ఓటమి దరిమిలా ఇటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ సీట్లను పెంచుకుంది. అయితే కీలక నేతలు మాత్రం కొంత సైలెంట్ గా ఉంటున్నారు. గతంలో కేసీఆర్ సర్కారుపై విశ్వరూపం చూపించిన నేతలు కూడా ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు. బండి సంజయ్, అర్వింద్, ఈటల రాజేందర్ రేవంత్ సర్కారు పై అసలు నోరు మెదపడం లేదు. తూతూ మంత్రంగా విమర్శలు గుప్పిస్తున్నా, అవి గతంలోలా మాత్రం లేవు.


మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ సర్కారు నడుస్తున్నదని బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాత్రమే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావులకు చెక్ పెట్టేందుకు బండి సంజయ్ నేరుగా రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తున్నది.


బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా రాష్ర్ట సర్కారుపై విమర్శలు చేయడం లేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇక రేవంత్ సర్కారు విషయంలో మూసీ సుందరీకరణ, హైడ్రా, నిరుద్యోగుల పోరాటం అంశంలో మాత్రం బీఆర్ఎస్ కు మైలేజీ దక్కకుండా బీజేపీ కీలక నేత బండి సంజయ్ ప్రయత్నం చేశారు.  ఆయన నేరుగా బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడారు.  కిషన్ రెడ్డి, అర్వింద్ కూడా ఇదే రీతిలో మాట్లాడారు. కాంగ్రెస్ పై కంటే బీజేపీ పైనే ఎక్కువ విమర్శలు చేస్తున్నారు.


మహేశ్వర్ రెడ్డి మాత్రం రేవంత్ సర్కారు పై విరుచుకుపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటల మోస్తున్నారని, ఆయన పదవి కొద్ది రోజుల్లో ఊడడం ఖాయమని మరోసారి విమర్శించారు. ఇక రేవంత్ ను కలిసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం చూపడం లేదంటూ మరో బాంబు పేల్చారు. అసలు రాహుల్ కులం, మతం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.


కాంగ్రెస్ తో బీజేపీ దోస్తీ చేస్తున్నదని బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది. బడే భాయ్, చోటే భాయ్ బంధం అంటూ ఎద్దేవా చేస్తున్నది.  ఏదేమైనా తెలంగాణలో ఎవరిస్థాయిలో వారు నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. అసలు ఎవరు ఎటువైపు ఉన్నారో అర్థం కాక జనాలు మాత్రం గొణుక్కుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: