బాలీవుడ్‌ దెబ్బ...సమంత షాకింగ్‌ నిర్ణయం ?

Veldandi Saikiran
స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సమంత గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది. స్టార్ అగ్ర హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సమంత నటనకు గాను ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

కాగా, సమంత ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. తమిళంలోనూ ఆఫర్లు వచ్చిన సినిమాలకు ఓకే చెప్పడం లేదు. కేవలం బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కేవలం ఇకనుంచి బాలీవుడ్ లోనే సినిమాలు చేయాలని అనుకుంటుందట.

ఆ కారణంగానే సమంత ముంబైలోనే ఉండాలని నిర్ణయం తీసుకుందట. కొద్ది రోజుల క్రితం సమంత ముంబైలో ఓ విలాసవంతమైన ఇంటిని కూడా కొనుగోలు చేసింది. ఇక నుంచి ఆ ఇంట్లోనే ఉంటూ బాలీవుడ్ లోనే సినిమాలు చేయాలని స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుందట. మరి సమంత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. కాగా, సమంత కు సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలో విపరీతంగా అభిమానులు ఉన్నారు.

సోషల్ మీడియాలో తనకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. దానికి తగినట్టుగానే సమంత ఎప్పటికప్పుడు వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటుంది. కేవలం ఫోటోలు మాత్రమే కాకుండా తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను అన్నింటిని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. తాను పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తుండడం విశేషం. ఇది ఇలా ఉండగా తన మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య రెండో వివాదం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: