బెనిఫిట్ షోలపై వస్తున్న వార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

MADDIBOINA AJAY KUMAR
నేడు సీఎం రేవంత్‌రెడ్డి సినీ ప్రముఖులతో భేటీ అయ్యారు. అయితే ఈ మీటింగ్ నేపద్యంలో నేడు సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులతో సీఎం రేవంత్ కలిశారు. సినీ ప్రముఖులు అల్లు అర్జున్, అల్లు అరవింద్, చిరంజీవి, వెంకటేష్, సిద్ధూ, కిరణ్ అబ్బవరం, వేణు తదితరులు పాల్గొన్నారు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగే ఈ మీటింగ్ లో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ భాగం అయ్యారు.
ఇదిలా ఉండగా.. ఈ మీటింగ్ లో బెనిఫిట్ షోలు ఉండవని రేవంత్ రెడ్డి తెలిపినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని దిల్ రాజు అన్నారు. సినీ పరిశ్రమపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని తెలిపారు. అసలు ఆ సమావేశంలో బెనిఫిట్‌ షోలు, టికెట్‌ ధరల ప్రస్తావన కూడా రాలేదని చెప్పుకొచ్చారు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మకండని అన్నారు. బౌన్సర్ల విషయాన్ని తమకు డీజీపీ చెప్పారని దిల్ రాజు తెలిపారు. హైదరాబాద్‌కు ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా అంతే కీలకమని సీఎం చెప్పారని చెప్పారు. FDCతో అనుసంధానం చేసుకుని.. గద్దర్ అవార్డ్స్‌ ఇవ్వాలని అన్నారని దిల్ రాజు స్పష్టం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో.. సెలబ్రిటీలు పాల్గొనాలని సీఎం తెలిపారని దిల్ రాజు వెల్లడించారు.
ఇకపోతే తెలంగాణ అభివృద్ధిలో సినీరంగం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని రేవంత్ రెడ్డి చెప్పారు. డ్రగ్స్‌ కట్టడి, మహిళా భద్రతపై ప్రచారంలో చొరవ చూపాలని స్పష్టం చేశారని అన్నారు. అలాగే ఆధ్యాత్మిక, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లాంటి ఘటనలు మళ్లీ ఎప్పుడు జరగకూడదని ఇలాంటి కండిషన్స్ సర్కార్ పెడుతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: