ముఖ్యమంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు.!

FARMANULLA SHAIK
బాలీవుడ్ ప్రముఖ నటుడు సోనూ సూద్. ఆ నటుడు గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రార్థించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అన్న మాటను ఆ నటుడు కరెక్ట్ గా సెట్ అవుతారు. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినా.. నిజ జీవితంలో సోనూ సూద్ రియల్ హీరో అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు,పేదలు ప్రాథమిక అవసరాలను తీర్చుతూ వారి పాలిట దేవుడుగా మారారు. ఈ క్రమంలో 'సోనూ ఫౌండేషన్' స్థాపించి, పేద ప్రజలకు ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడు. అయితే ఆయన రాజకీయాల్లో అడుగుపెడుతున్నారా? అనేది ఎప్పడు చర్చనీయమే.అయితే.. కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం సోనూసూద్ చేశారు. తన పేరిట సోనూ సూద్ ఛారిటీ స్థాపించి ఎంతోమందికి సహాయం అందించాడు. ఇప్పటికీ ఆయన సాయం చేస్తూ ప్రజలను ఆడుకుంటున్నాడు. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగు పడినా తన సమాజ సేవను కొనసాగిస్తూ తన గొప్ప మనసును చాటుకున్నారాయన. 

ఈ నేపథ్యంలో హీరో సోనూ సూద్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ చాలా సార్లు ఊహాగానాలు వచ్చాయి. అయితే నటుడు ఎప్పుడూ అలాంటి పుకార్లకు స్వస్తి పలికి సామాజిక సేవలో నిమగ్నమయ్యారు. రాజకీయాల్లోకి రావాలనే ఆశయంతోనే ఆయన సామాజిక సేవ చేస్తున్నాడని చాలా వాదనలు వెలుగులోకి వచ్చాయి. ఈ వాదనలు ఆరోపణలే అని పలుమార్లు నిరూపించబడ్డాయి. ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావడానికి రెడీ అవుతున్నాడు సోనూసూద్. త్వరలో విడుదల కానున్న తన కొత్త చిత్రం ఫతే ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ప్రమోషన్ సమయంలో ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజకీయాల్లోకి రాబోతున్నారా? అని ప్రశ్నించగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు సోన్ సూద్.ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సోను సూద్‌ మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు కొవిడ్‌ సమయంలో ప్రజలకు నేను సాయం చేసినందుకు గానూ సీఎం పదవిని ఆఫర్ చేశారు. నేను తిరస్కరిస్తే డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యత్వం కూడా అఫర్ చేశారు. నేను సున్నితంగా తిరస్కరించాను. స్వేచ్ఛను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. అందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నా. ప్రజలు రెండు కారణాల వల్ల రాజకీయాల్లోకి వస్తారు. ఒకటి డబ్బు సంపాదించడం కోసం లేదా అధికారం కోసం. వాటిలో దేనిపైనా నాకు ఆసక్తి లేదు. ప్రజలకు సాయం చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలనుకుంటే అది నేను ఇప్పటికే చేస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: