కమెడియన్ వేణు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎన్నో సినిమాలలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వేణు సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమయ్యాడు. అనంతరం బలగం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో వేణుకు మంచి గుర్తింపు దక్కింది. బలగం సినిమా తర్వాత వేణు మరోసారి ఎల్లమ్మ అనే టైటిల్ తో మరో సినిమాను తీయబోతున్నారు.
ఈ సినిమా ఎల్లమ్మ తల్లి కథ నేపథ్యంతో తెరకెక్కుతుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమా పనులు ప్రారంభిస్తామని వేణు వెల్లడించారు. అయితే బలగం సినిమాలో ఎక్కువగా కొత్త వారితోనే వేణు సినిమాను తీశాడు. కొత్తవారి దగ్గర నుంచి అతనికి కావాల్సిన ఎమోషన్ ని పూర్తిగా తీసుకున్నాడు. ఇప్పుడు వేణు ఎల్లమ్మ సినిమా కోసం హీరో నితిన్ నీ పెట్టి సినిమా తీయబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి చేస్తుందని ఓ వార్త వైరల్ అవుతుంది.
నితిన్, సాయి పల్లవి ఇలాంటి స్టార్స్ ని పెట్టి సినిమా తీయడం కాస్త కష్టమే. అయితే వేణు ఎల్లమ్మ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వేణు కూడా బలగం సినిమా పూర్తి తెలంగాణ నేపథ్య కథ అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఎల్లమ్మ శక్తి రూపం అందుకే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన కథగా కాకుండా అందరూ వారి శక్తి రూపా స్వరూపాలను చూసుకునేలా సినిమాలు చేస్తున్నామని అన్నారు.
వేణు ఎల్లమ్మకి ఈ స్టార్స్ ని హ్యాండిల్ చేయడమే పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుండగా, వారు పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తే మళ్లీ వేణు మ్యాజిక్ చేసే అవకాశం ఉన్నట్టే. దిల్ రాజు కూడా ఈ సినిమాకు వేణు అడిగినంత బడ్జెట్ ను కేటాయిస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి అంత పెద్ద భారీ బడ్జెట్ తో వేణు రిస్క్ తీసుకుంటున్నాడేమోనని కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. బలగం సినిమా మంచి సక్సెస్ అందుకున్నట్లే ఎల్లమ్మ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.