మోదీ కోరిక ఇప్పట్లో నెరవేరదా? కాంగ్రెస్ మద్దతు లేకుంటే కష్టమేనా !

ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి జమిలి ఎన్నికలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఒకే దేశం ఒకే రాజకీయం అన్నది బీజేపీ పొలిటికల్ ఫిలాసఫీ అని విపక్షలు విమర్శలు చేస్తున్న సంగతి విధితమే.


జమిలి ఎన్నికలు అంటే కచ్చితంగా దేశంలో జాతీయ పార్టీలదే పై చేయిగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు వారి ఆకాంక్షలు అన్నీ కూడా పూర్తిగా పక్కకు పోతాయి. అదే టైం లో జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీకి భారీ అడ్వాంటేజ్ లభిస్తుంది. అందుకే బీజేపీ జమిలి ఎన్నికల నినాదాన్ని అందుకుంది. బీజేపీ ఏ స్లోగన్ ఇచ్చినా అందులో కచ్చితంగా పార్టీ ప్రయోజనాలు ఉంటాయని విపక్షాలు ఎపుడూఅ అంటూ ఉంటాయి. ఇపుడు కూడా అదే అంటున్నాయి. మోడీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే నో అంటోంది కాంగ్రెస్.



మోడీవి కలలే అని కాంగ్రెస్ పార్టీ అడ్డంగా కొట్టి పారేస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నది అసలు అమలు అయ్యేది కాదూ పాడూ కాదు అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె భారీ కౌంటర్ ఇచ్చారు ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ మోడీ తాజాగా జమిలి ఎన్నికలు అనివార్యం అంటూ చేసిన కామెంట్స్ ని పూర్తి స్థాయిలో తప్పు పట్టారు.  పార్లమెంట్ లో అన్ని పార్టీల ఆమోదం ఉండాలని అపుడే అది ఆచరణలోకి వస్తుందని అన్నారు.



కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి లోక్ సభలో 240 మంది దాకా ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో కూడా తొంబైకి తక్కువ లేకుండా ఎంపీలు ఉన్నారు. ఇక దేశంలో ఇండియా కూటమి పార్టీలు చాలా రాష్ట్రాలను ఏలుతున్నాయి. ఈ నేపధ్యంలో జమిలి ఎన్నికలు అంటూ బీజేపీ చెబుతున్నది ఆచరణ సాధ్యమేనా అన్న చర్చకు తెర లేస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీలు ఏవీ ఈ ప్రతిపాదనకు అసలు మద్దతు ఇవ్వవని అంటున్నారు. దీంతో మోడీ జమిలి అంటే కాంగ్రెస్ నో జమిలి అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: