కేటీఆర్ పై పడే దీపావళి బాంబ్ ఇదేనా..? జైలుకి వెళ్ళక తప్పదా?

''దీపావళికి టపాసులు పేలుతాయి..'' అంటూ ఓ వైపు అధికార పార్టీ నాయకులు ప్రకటనలు చేస్తుండగా.. ''కేసులతో ఇబ్బందులకు గురిచేసే కుట్రలు జరుగుతున్నాయి'' అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపావళికి రెండ్రోజుల ముందు 'ఫార్ములా-ఈ' బాంబు పేలింది. హైదరాబాద్‌ నగరంలో ఫార్ములా-ఈ రేసింగ్‌ నిర్వహణకు గత ప్రభుత్వంలో కీలక నాయకులు ప్రధాన పాత్ర పోషించారు.


ఈ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా.. విదేశీ సంస్థలకు నిధులు మళ్లాయని ప్రభుత్వం గుర్తించింది. దీంతో.. సమగ్ర దర్యాప్తు జరపాలంటే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.  సచివాలయం ఎదుట.. ట్యాంక్‌బండ్‌ చుట్టూ.. ఫార్ములా-ఈ రేసింగ్‌ కోసం 3 కిలోమీటర్ల మేర ట్రాక్‌ నిర్మించారు.


2023లో తొలిసారి ఫార్ములా-ఈ రేస్‌ను నిర్వహించారు. ఈ రేసింగ్‌కు దేశవిదేశాల నుంచి పెద్దసంఖ్యలో వీక్షకులు హాజరయ్యారు. 2024 ఫిబ్రవరి 10న కూడా ఫార్ములా-ఈ రేసింగ్‌కు విదేశీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విదేశీ సంస్థతో ఎంవోయూ చేసుకుని, నిధులు చెల్లించాలంటే.. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) అనుమతి అవసరమని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. ఫార్ములా-ఈ రేసింగ్‌ నిర్వహణ విషయంలో.. ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధి (ఎంవోయూడీ) శాఖ నుంచి రూ.55 కోట్ల మేర విదేశీ సంస్థలకు నిధులను చెల్లించారు.



గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ.. డిసెంబరులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం మారిన వెంటనే.. తాము ఫార్ములా-ఈ ఆపరేషన్‌ను నిర్వహించడం లేదంటూ విదేశీ సంస్థలు ప్రకటించాయి.  ఈ అంశంపై దృష్టి సారించిన ప్రభుత్వం.. అంతర్గత దర్యాప్తు చేయించింది. ఫార్ములా-ఈ రేసింగ్‌ నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఆర్థిక శాఖ, ఇతర విభాగాల నుంచి ముందస్తు అనుమతుల్లేకుండానే.. విదేశీ సంస్థలకు రూ.55 కోట్లను చెల్లించినట్లు వెల్లడైంది.



అప్పటి అధికారుల ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో.. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని ఏసీబీని కోరారు. ఏసీబీ కూడా ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసేందుకు అనుమతినివ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ktr

సంబంధిత వార్తలు: