వైసీపీ లో ఒంటరి అయిన సజ్జల..! జగన్ హ్యాండ్ ఇచ్చారా?

వైసీపీలో సజ్జల రామకృష్ణా రెడ్డి ఒంటరి అయ్యారా? ఆయనకు నేతల వెన్నుదన్ను లేకుండా పోయిందా? అధినేత జగన్ సైతం పక్కన పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. గత ఐదేళ్లలో ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న ఎదిగారు సజ్జల. అంతకు ముందున్న విజయ సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను కాదని జగన్ కూడా సజ్జలకే ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు.


సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డికి కూడా పార్టీలో కీలకమైన సోషల్ మీడియా విభాగం ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. వైసీపీ అధికారానికి దూరం అయింది. దారుణ పరాజయం చవి చూసింది. ఇంతటి ఓటమికి సజ్జల ఇచ్చిన సలహాలే కారణమని ఆరోపణలు కూడా చుట్టుముట్టాయి. నేరుగా వైసీపీ నేతలు కూడా సజ్జలపై ఆరోపణలు కూడా చేశారు.


అటు సజ్జల సైతం ఓటమి తర్వాత జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశాలకు హాజరు కాలేదు. ఇక భార్గవ్ రెడ్డిని కూడా సోషల్ మీడియా ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు సజ్జల మాట చెల్లుబాటు అయింది. ఇప్ఉపము మాత్రం ఓటమికి ఆయనే కారణం అన్నట్లు పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన పార్టీలో ఒంటరి వారు అయ్యారనే టాక్ కూడా బాగానే వినిపిస్తోంది.


తాజాగా సజ్జల మెడకు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు చుట్టుకుంది. ఆయనకు మంగళగిరి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆయన మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు కూడా హాజరు అయ్యారు. అయితే ఒకప్పుడు ఆయన అడుగుపెడితే పార్టీ ముఖ్య నేతలంతా చుట్టూ ఉండేవారు. ఇప్పుడు మాత్రం న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఒకరిద్దరు నాయకులు మాత్రమే కనిపించారు. ఆయనకు మద్దతుగా ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టకపోవడం గమనార్హం. దీంతో ఆయన్ను కావాలనే వైసీపీ అధినేత సైడ్ చేస్తున్నారా అనే ప్రచారం జోరుగా సాగుతోంది.  మరి చూద్దా ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: