షర్మిళతో అవసరం తీరిందా? రాహుల్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారా?

వైఎస్ షర్మిళపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహంతో ఉన్నారా? ఉన్న కొద్ది పాటి మంది సీనియర్లు ఆమెను వ్యతిరేకిస్తున్నారా? ఆమెపై హైకమాండ్ కు ఫిర్యాదులు వెళ్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరిట రాజకీయ కార్యకలాపాలు కొనసాగించిన షర్మిళ.. సుదీర్ఘకాలం పాటు తెలంగాణలో పాదయాత్ర కొనసాగించారు.


కానీ అనుకున్న స్థాయిలో తెలంగాణ ప్రజల నుంచి స్పందన రాలేదు. దీంతో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు షర్మిళ. అటు తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశం అయి.. ఆమె సమక్షంలోనే పార్టీలో చేరారు. గతంలో తన సోదరుడు జగన్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చినప్పుడు బాహాటంగానే మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. కానీ అదే హస్తం గూటికి చేరి అందర్నీ ఆశ్చర్య పరిచారు.


ఇక ఏపీలో జగన్ దూకుడుకు కళ్లెం వేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ షర్మిళను ప్రయోగించింది. ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిమిత సీనియర్ నాయకులు కూడా ఆమె రాకను ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె కారణం అవుతుందని వారంతా భావించారు. కానీ ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరగలేదు. ఎన్నికల తర్వాత కూడా ఆమె వైఖరి మారలేదు. సొంత అజెండాతో ముందుకు వెళ్లడం సీనియరల్లు నేరుగా అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం.


ఇక షర్మిళ నియామకం జగన్ కు కష్టంగా మారింది. కానీ కాంగ్రెస్ కు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అధికారంలోకి రాకుండా జగన్ ను అడ్డుకోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. జగన్ దారుణ పరాజయం వెనుక షర్మిళ కూడా ఉన్నారని విశ్లేషకులు అంటుంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా సొంత అజెండాతోనే ఆమె ముందుకు వెళ్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనిపై అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయంట. ఇలా వరుస ఫిర్యాదులతో హైకమాండ్ షర్మిళ విషయంలో సీరియస్ గానే ఆలోచిస్తుందంట. మరి ఆమెను మార్చుతారా లేకుంటే మందలిస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: