బాబు, పవన్ జట్ల మధ్య కుమ్ములాటలు స్టార్ట్..?

కారణమేంటో తెలియదు.. అక్కడ ఉండలేకపోతున్నారో కేసుల భయం పట్టుకుందో కానీ.. వైసీపీని వీడి  జనసేనలోకి చేరేందుకు రెడీ అయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్యాన్ పార్టీలో గౌరవం దక్కడం లేదని..  అందుకే పార్టీని వీడుతున్నానని బాలినేని జనసేన తలుపు తట్టారు. పవన్ ఓకే చెప్పడంతో కూల్ అనుకున్నారంతా..


 కానీ అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఈ నెల 26న జనసేన కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ మాత్రం జనసేనలో బాలినేని చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసే ఉన్నాయి. అందుకే బాలినేనిని ఎలా చేర్చుకుంటారంటూ ప్రశ్నిస్తున్నారు.


ఒంగోలు నియోజకవర్గం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వైరం. ఎప్పటి నుంచో బాలినేనిక వ్యతిరేకంగా పోరాడుతున్నారు జనార్ధన్. అందుకే కూటమిలో కీలకంగా ఉన్న జనసేనలో బాలినేని చేరడంతో ఆయనకు నచ్చడం లేదు.


ఈ విషయాన్ని ఆయన బహిరంగంగానే చెబుతున్నారు దామచర్ల. ఒంగోలు కూటమి నేతలు బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాలినేని తీసుకోవద్దంటూ చాలా సార్లు అటు సీఎంవోకు ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఫిర్యాదులు చేశారు. అయితే ఈనెల 26న జనసేన కండువా కప్పుకుంటారని స్వయంగా ప్రకటించడంతో అప్పటి వరకు అగ్గి మీద గుగ్గిలంగా ఉన్న టీటీపీ, జనసేన శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.


దీనికి తోడు పవన్ కల్యాణ్ ను బాలినేని కలిసివచ్చిన మరునాడే ఒంగోలులోని పలు సెంటర్లలో జనసేనలోకి బాలినేనికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం రచ్చకు దారి తీసింది. అందులో టీడీపీ, జనసేన నేతలు ఫొటోలు వేయడంపై కూటమి నేతలు ఆగ్రహంతో రగిలిపోయారు. బాలినేని అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేశారు టీడీపీ కార్యకర్తలు.


ఇక తనపై దాడులు చేయించి 32 కేసులు పెట్టిన బాలినేని , ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డని.. వారు ఏ పార్టీలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదంటున్నారు దామచర్ల.  చివరకు ఏం జరిగిద్దో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: