ఆపని చేసిన వారికే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ?
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ పుంజుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో పొత్తులతో కొన్ని సీట్లు నెగ్గిన బీజేపీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లను గెలుచుకుంది. ఇక 2024 లోక్ సభ ఎన్నికల్లోను ఒంటరిగా ఎనిమిది ఎంపీలను గెలుచుకుంది. మరింత సత్తా చాటింది. కాషాయ పార్టీకి ఇంత ఊపు రావడానికి ప్రధాన కారణం మాజీ అధ్యక్షుడు బండి సంజయ్.
ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. 2020లో పార్టీ పగ్గాలు చేపట్టిన సంజయ్ పార్టీకి అనూహ్యంగా ఊపు తీసుకువచ్చారు. పాదయాత్రతో క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేశారు. అయితే అనూహ్యంగా ఎన్నికలకు ముందు 2023 లో సంజయ్ ని అధిష్ఠానం అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. తాత్కాలిక అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. ఆయన సారథ్యంలోనే అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలకు వెళ్లింది. దీంతో బీజేపీ ఆశించిన మేర రాణించలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
ఇక లోక్ సభలో మాత్రం మోదీ మేనియాతో రాష్ట్రంలో సగం ఎంపీ సీట్లను గెలుచుకుంది. అయితే ఎన్నికలు ముగిసినా పార్టీకి అధ్యక్షుడిని నియమించలేదు. ఇటీవల దీనిపై కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ ప్రేం సాగర్ రావు లు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి ని జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఇన్ ఛార్జిగా అధిష్ఠానం నియమించింది.
దీంతో ఆయన తెలంగాణపై ఫోకస్ పెట్టడం లేదు. దీంతో పార్టీ ఆరేళ్లకోసారి చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు మొదలు పెట్టింది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 70 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో సభ్యత్వాలు 70 చేర్పించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అధ్యక్ష పదవి కావాలనుకునే వారికి టార్గెట్ విధించినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి కావాలనుకునే నేతలు దీనిని ఛాలెంజ్ గా తీసుకొని అధిష్టానం దృష్టిలో మార్కులు కొట్టేయడానికి తీవ్రంగా యత్నిస్తున్నట్లుత తెలుస్తుంది. ఎవరు ఎక్కువ సభ్యత్వాలు చేయిస్తే వారికే అధ్యక్ష పదవి ఇస్తారనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.