రూటు మార్చిన షర్మిళ..! ఈ సారి బాణం ఎవరి వైపు అంటే?

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ.. మొదటి నుంచి తన అన్న వైసీపీ అధినేత జగన్ కు టార్గెట్ చేసుకుంటూనే వచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలోని వైఫల్యాలను హైలెట్ చేస్తూ.. వాటిని జనాల్లోకి  తీసుకెళ్లి ఒక రకంగా వైసీపీకి ఓటమికి కాస్తో కూస్తో షర్మిళ కారణం అయ్యారు.


రాజకీంయగానూ, వ్యక్తగతంగానూ షర్మిళ జగన్ ను టార్గెట్ చేసుకోవడం, వైఎస్ అభిమానుల్లో ఎక్కువ మంది జగన్ కు మద్దతు పలుకుతుండటంతో వారిలో చీలిక తెచ్చే విషయంలోను అనుకున్న మేర షర్మిళ సక్సెస్ అయ్యారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వైసీపీని జగన్ ని టార్గెట్ చేసుకొని షర్మిళ  రాజకీయంగా విమర్శలు చేస్తూ వచ్చారు. సిద్ధాంత పరంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి తాను వ్యతిరేకం అంటూనే జగన్ ను టార్గెట్ చేయడం పట్ల వైసీపీ విమర్శలు గుప్పించింది.


అయితే అనూహ్యంగా షర్మిళ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం విజయవాడలో సంభవించిన వరదల్లో జగన్ పై పరోక్షంగా విమర్శలు చేసి కూటమికి మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి షర్మిళ విమర్శలు మొదలు పెట్టారు. అయితే ఈ మార్పునకు కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని షర్మిళ విమర్శించారు.


కేంద్రం నుంచి నిధులను రాబట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారని షర్మిళ విమర్శించారు. అటువంటప్పుడు అసుల ఎన్డీయేలో ఎందుకు కొనసాగుతున్నారని చంద్రబాబుని ప్రశ్నించారు. తక్షణం ఎన్డీయే నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో జగన్ నివాసంలో కాంగ్రెస్ నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా షర్మిళ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ని టార్గెట్ చేయకుండా ప్రభుత్వాన్ని విమర్శించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందాయని అందుకే షర్మిళ తన బాణం కూటమి వైపు ఎక్కు పెట్టిందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: