60 ఏళ్లు దాటాయా.. మీరే వారి టార్గెట్?
ఏ చిన్న అవకాశం దక్కినా.. అవతల వ్యక్తి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్లు పెద్ద గాళాలను సిద్ధం చేసి వదులుతున్నారు. ఒక్కోసారి భారీ వలలే విసురుతున్నారు. ఎప్పటి కప్పుడు వారు తమ రూట్ ను మార్చుతూ కొత్త తరహా మోసాలకు తెర లేపుతున్నారు. ఈ సారి సైబర్ క్రిమినల్స్ చూపు వృద్ధులపై పడింది. అమ్మాయిలతో వాట్సప్ వీడియో కాల్స్ చేయిస్తారు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తారు. బాధితుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. కొత్త తరహా మోసాల గురించి కృష్ణా జిల్లా పెనమలూరు సీఐ వెల్లడించారు.
రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన సైబర్ నేరగాళ్లు వృద్ధులను లక్ష్యంగా చేసుకొని రూ.లక్షలు దండుకుంటున్నారు. తొలత వాట్సప్ లో వీడియో కాల్ చేస్తారు. ఈ కాల్ ఎత్తగానే అమ్మాయిలు కనిపిస్తారు. వారు నగ్నంగా ఉంటారు. వారి ఒంటి మీద నూలుపోగు కూడా ఉండదు. అమ్మాయిలు మూడు, నాలుగు నిమిషాల పాటు వృద్దులతో చాట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే.. వాట్సప్ కు ఓ లింక్ పంపిస్తారు.
ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది. మేము పోలీసులం అంటూ వృద్ధులకు ఫోన్ కాల్స్ వస్తాయి. వీడియో చూపి బ్లాక్ మెయిల్ చేస్తారు. రూ.10 నుంచి రూ.20 లక్షల వరకు డిమాండ్ చేస్తారు. అడిగనంత ఇవ్వకపోతే మీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తాం అంటూ బ్లాక్ మెయిల్ చేస్తారు. కాగా. రిటై్ అయిన ఉద్యోగులను సైబర్ గ్యాంగ్ టార్గెట్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం బయటకు వస్తే తమ పరువు పోతుందని డబ్బు పోగోట్టుకున్నా బాధితులు మిన్నకుండిపోతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తరహా ఘటనలు వెలుగు చూశాయి. కానీ బాధితులు తమ పరువు పోతుందని ఫిర్యాదులు చేయడం లేదు.