ఆ అధికారి వెరీ స్పెషల్‌.. జగన్ , బాబు ఇద్దరూ మెచ్చారుగా?

ప్రభుత్వాలు మారిన తర్వాత కొంతమంది అధికారులకు స్థానం చలనం సహజంగా జరిగేదే. కొన్ని ప్రభుత్వాలు తాము అధికార దండాన్ని తీసుకున్నంతనే ఇలాంటి వారిపై ఫోకస్  చేస్తుంటాయి. కానీ ఏపీ సీఎం చంద్రబాబు తీరు అందుకు భిన్నంగా ఉంది. గత ప్రభుత్వంలో కీలక శాఖలో పనిచేసిన వారిని తిరిగి ఈ ప్రభుత్వంలోను కొనసాగిస్తున్నారు. దీంతో పాటు అంతే ప్రాధాన్యం ఉన్న శాఖను అప్పజెబుతున్నారు.

మామూలుగా అయితే వైసీపీ హయాంలో ఉన్న అధికారులు… తమపై కక్షపూరితంగా వ్యవహరించారని.. అక్రమంగా కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఇప్పుడు వైసీపీ కూడా అదే మాదిరి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా ఉన్న అధికారులను అధికారంలోకి వస్తే అందలం ఎక్కించడం సహజంగా జరిగేదే. అయితే ఓ అధికారిని మాత్రం అటు జగన్, ఇటు చంద్రబాబు ఇద్దరూ మెచ్చుకున్నారు.  కీలక శాఖలు అప్పజెప్పారు. ఇంతకీ ఎవరా ఆ అధికారి అంటే..

ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ సలహాదారుగా పని చేస్తున్న ఎం. వెంకటేశ్వరరావు,. అవును..  ఈయన్ను ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ గా చంద్రబాబు సర్కారు నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న సి.నారాయణ రెడ్డి పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ప్రభుత్వ ఆదేశాను సారం వెంకటేశ్వరారవు ఈ పదవిలో నియమితలుయ్యారు. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

వెంకటేశ్వరరావు గతంలోను జలవనరుల శాఖ ఈఎన్సీగా పనిచేశారు. 2019 డిసెంబరులో పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత నుంచి ఆయన సలహాదారు పదవిలో కొనసాగుతున్నారు. చంద్రబాబు సర్కారు కూడా ఆయన్ను సలాదారుగా నియమించింది. ప్రస్తుతం ఇంజినీర్ ఇన్ చీఫ్ గా అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్న నారాయణ రెడ్డి కమిషనర్ ఆఫ్ టెండర్స్, కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ పోస్టులను కూడా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆ రెండు పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. అయితే వైసీపీ, ప్రస్తుత టీడీపీ హయాంలో వెంకటేశ్వరావుకి అంతే ప్రాధాన్యం ఉన్న శాఖలు దక్కడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: