నారా లోకేశ్‌: హామీ తీర్చలేక.. సాకులు వెదుకుతున్నారా?

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ రూ.4 వేలకు పెంచడం మినహా మరో సంక్షేమ పథకం అమలు కాలేదు.  శ్వేత పత్రాలు పేరు చెప్పి.. గత ప్రభుత్వంపై బురద జల్లుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం లేదని.. అసలు వాటి ఊసే ఎత్తడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.  కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా స్కూల్స్ స్టార్ట్ అయ్యాక విద్యార్థుల తల్లికి అందాల్సిన రూ.20 వేల సాయం అందలేదు.

ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చావు కబురు చల్లగా చెప్పినట్లు.. తల్లికి వందనం పథకం ఈ ఏడాది లేదని బాంబు పేల్చారు. ఈ పథకం అమలు చేయడానికి అవసరమైన డేటా తమ ప్రభుత్వం వద్ద సిద్ధంగా లేదని దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎంజగన్ స్పందించారు.

ఇందులో భాగంగా.. తాను లేకపోయే సరికి ఉన్న రూ.15 వేలు లేకుండా పోయింది. ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామన్న రూ.15 వేలు కూడా రాకుండా పోయాయి అని విమర్శించారు. అమ్మ ఒడికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టారు. ఇలా తల్లికి వందనం అంటూ శఠగోపం పెట్టారంటూ ఎద్దేవా చేశారు.  ఇదే సమయంలో ఎన్నికల మ్యానిఫెస్టోలో ఎంత మంది పిల్లులు ఉంటే అంతమంది అని చెప్పి… అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మంది పిల్లలు అనే విషయం పక్కకు పోయి తల్లులు ఎంతమంది అనే టాపిక్ తెచ్చారని ఇది మరో మోసం అన్నారు.

నారా లోకేశ్ డేటా లేదు అంటున్నారు అని ఏం డేటా కావాలని ప్రశ్నించారు.  రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 43 లక్షల మంది తల్లలుకు అమ్మ ఒడి ఇస్తే.. 84 లక్షల మంది పిల్లలకు మేలు జరిగిందని తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ఎంత మంది చదువుతున్నారు. కొత్తగా ఎంతమంది ప్రవేశం పొందారు అనే విషయం గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా తెలియదా అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: