చైనాకి ఆ విషయంలో అండగా నిలుస్తున్న భారత్?

ప్రపంచం ప్రశాంతంగా లేదు. అంతర్గత కలహాలు,  తెరవెనుక కుట్రలకే పరిమితం కావడం లేదు. శత్రు దేశాలను కవ్విస్తున్నాయి. సరిహద్దు దేశాలతో కావాలనే గొడవలు పెట్టుకుంటున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కూటములు కడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు అగ్రరాజ్య హోదా కోసం, కొన్ని దేశాలు దానిని నిలబెట్టుకునేందుకు ఆరాట పడుతున్నాయి.

సరిగ్గా ఈ కోవకే చెందినదే చైనా.  ప్రపంచంలో టాప్-3  దేశంగా కొనసాగుతున్నా కూడా.. ప్రపంచాన్ని శాసించాలి.. పెద్దన్న పాత్ర పోషించాలి.. మిగతా దేశాలన్నీతమ చెప్పు చేతల్లో ఉండాలని చైనా భావిస్తోంది. అందుకే లేని పోని కుట్రలు, కుతంత్రాలతో మిగతా దేశాలకు పక్కలో బల్లెంలా తయారవుతుంది. ఇక మన దేశ విషయంలో కూడా డ్రాగన్ బుద్ధి మారదు. భారత సరిహద్దుల వెంట.. దేశాన్ని అస్థిర పరిచే కుట్రలను ఏ మాత్రం ఆపదు. ఎప్పటికప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడటం, ఆ తర్వాత సైలెంట్ అయి పోవడం చైనాకి పరిపాటిగా మారింది.

అయితే భారత్ చైనా విషయంలో ఎలాంటి దాపరికాలు చేయడం లేదు. దాగుడు మూతలు అంతకన్నా లేవు. మన జోలికి రానంతవరకు ఓకే. ఒకవేళ వస్తే యాక్షన్ కు రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరిస్తోంది. అయితే చైనా, భారత్ ఎప్పుడు ప్రత్యక్షంగా కొట్లాడుకోలేదు. లోలోపల  పీకలదాకా శత్రుత్వం ఉన్నా.. పైకి మాత్రం దానిని కనిపించనివ్వవు.  విదేశాంగ వ్యవహారాలు, వస్తువుల దిగుమతులు తదితర అంశాలపై ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూనే ఉంటాం.

అయితే వ్యాపార పరంగా చైనాకి కొన్ని పరిమితులను భారత్ విధించింది. కొన్ని ప్రత్యేక అవసరాల దృష్ట్యా దానిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. చైనీస్ టెక్నీషియన్ కు మనం వీసా ఇవ్వాలంటే నాలుగు నుంచి ఐదు నెలల సమయం పడుతుంది. దీనిని ఇప్పుడు నెల రోజుల్లోనే క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. చైనాకు సంబంధించిన మిషనరీలు వాడుతున్న సమయంలో అవాంతరాలు ఎదురైతే వాటిని రిపేర్ చేసేందుకు చైనీస్ టెక్నీషియన్లు వచ్చేందుకు బాగా సమయం పడుతోందని పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వం తీసుకెళ్లగా కేంద్రం సానుకూలంగా స్పందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: