ఈ మేలు చేస్తే.. మన రైతన్నలు ప్రపంచానికే అన్నం పెడతారు?
ఇంతటి ఖర్చును భరించలేని వారు వ్యవసాయం చేయాలనే ఆశ ఉన్నా పెట్టుబడి చూసి జంకుతున్నారు. దీంతో వారంతా ఉపాధి కోసం పట్నం బాట పడుతున్నారు. వారి కుమారులు సైతం ఏదో ఒక కంపెనీలోను.. ఇతర చిన్న చిన్న ఉద్యోగాల్లో పట్టణాల్లో స్థిరపడుతుంటే వారి తల్లిదండ్రులు కూడా అటే తరలి వెళ్తున్నారు. అయితే ఇదివరకటి రోజుల్లో అన్ని వ్యవసాయ అవసరాలకు మనుషుల మీదే ఆధారపడాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం భూమిని సిద్ధం చేసి విత్తనాలు వేయడం దగ్గర నుంచి పంట కోసేవారు అన్ని పనులకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మన దేశంలో చిన్న సన్నకారు రైతులు చాలా ఎక్కువ. వీరు ఈ యంత్రాలు కొనుగోలు చేయాలంటే కష్టం. ఈ లోటును సరిచేసేందుకు ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ ఉపకరణాలను అందుబాటులోకి తీసుకువస్తుంది.
ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని కొందరు రాణిస్తున్నా.. మరికొందరు వెనకబడి పోతున్నారు. ప్రభుత్వం వీరిపై దృష్టి సారించి వ్యవసాయంలో యాంత్రీకరణ వల్ల కలిగే ఉపయోగాలు, డబ్బు, సమయం ఆదా వంటి విషయాలపై అవగాహన కల్పించి గ్రామీణ రైతులను ప్రోత్సహించాలి. వాస్తవానికి అన్నదాతలు కూడా యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరికి అవగాహన కల్పిస్తే చాలు. అన్నదాతలకు మేలు చేసిన వారు అవుతారు.