769 కోట్ల మంది శ్రేయస్సే.. మన కోటిరెడ్డి లక్ష్యం?

కేవలం పదో తరగతి క్వాలిఫికేషన్‌తో ఓ కుర్రాడు మైక్రోసాఫ్ట్‌ సంస్థలో కీలక పదవి దక్కించుకునే స్థాయికి ఎదుగుతాడని ఎవరైనా ఊహించగలరా.. ఓ మారుమూల పల్లెటూళ్లో చదివిన అబ్బాయి.. పదుల సంఖ్యలో కంపెనీలు పెడతాడని ఎవరైనా కలగనగలరా.. చిన్నతనంలో తండ్రికి వ్యవసాయంలో సాయం చేస్తూ మట్టితో ఆటలాడిన ఆ పిల్లగాడు.. ఆ తర్వాత వేల మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే ఓ సంస్థకు ఊపిరిపోస్తాడని అనుకోగలరా.. అయితే.. పట్టుదల ఉంటే కానిది లేదు.. సత్సంకల్పం ఉండాలే కానే.. మనిషి ఎదుగుదలకు హద్దులు లేవు.. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తున్నారు కోటి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత సరిపల్లి కోటిరెడ్డి.

సరిపల్లి కోటిరెడ్డి.. గుడివాడ వద్ద ఓ పల్లెటూరు నుంచి ఎదిగిన యువ ఎంటర్‌ప్రెన్యుయర్‌. గుడివాడలోని ఓ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకోవడం ప్రారంభించిన కోటి రెడ్డి.. ఆ నేర్చుకోవడం ఇంకా ఆపలేదు. అలా నేర్చుకుంటూనే గుడివాడ నుంచి హైదరాబాద్‌ మీదుగా మైక్రోసాఫ్ట్‌ వరకూ ఆయన ప్రయాణం సాగింది. మైక్రోసాఫ్ట్‌లో ఉన్నతోద్యోగం.. ఇండియా నుంచి వచ్చిన ఏ కుర్రాడికైనా అదో డ్రీమ్‌. ఆ డ్రీమ్‌ నెరవేరాక ఇక అక్కడే సెటిలైపోదాం అనుకుంటారు.

కానీ కోటిరెడ్డికి స్వదేశంపైనే మమకారం. ఆర్థికంగా కాస్త బలపడ్డాక.. ఇక సొంత దేశానికి వచ్చేశారు. టెక్నాలజీ రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను ఉపయోగించుకుని మానవాళికి ఏదైనా చేయాలనేది కోటిరెడ్డి అభిమతం. డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వ్యాపారం చేయాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ.. చేసే వ్యాపారం.. నలుగురికి మేలు చేసేదిగా ఉండాలి. నలుగురికి మేలు చేస్తూ మనం ఎదగాలి.. ఇదే కోటి రెడ్డి అనుసరించే జీవన సూత్రం. అందుకే వసుధైక కుటుంబం ఆయనేది ఆయన గ్రూప్‌ నినాదంగా మారింది.  

కోటిరెడ్డి ఎంచుకునే రంగాలు.. వినూత్నంగా ఉంటాయి. భారత్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌, డిజిటల్‌ ఎడ్యుకేషనల్‌ ఎకో సిస్టమ్స్‌, ఇండియా హెరాల్డ్‌ మీడియా, డీజే పే, భారత్‌ హెల్త్‌కేర్‌ ల్యాబ్స్‌, పినాకిల్‌, పిల్బే, నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ కేర్‌, బ్లడ్‌, శ్రీధరణి, ఇంటర్నేషనల్‌ క్వాలిటీ మెజర్స్ వంటి టెక్‌ కంపనీలతో పాటు  సేవా ఫౌండేషన్‌, కోటి ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.  230 దేశాల్లోని.. 769 కోట్ల ప్రజల జీవితాల్లో సానుకూల ప్రభావం తీసుకురావాలన్న కోటిరెడ్డి ఆశయం నెరవేరాలని మనసారా కోరుకుంటూ ఆయనకు ఇండియా హెరాల్డ్ జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: