మన కాలపు చాణక్యుడు.. చంద్రబాబు అసలైన సక్రెస్‌ సీక్రెట్‌ ఇదే?

చంద్రబాబు ఒక పడిలేచిన కెరటం. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఇక ముగిసింది అని అనుకుంటున్న సమయంలో తాను మళ్లీ విజయ కేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో గెలిచి 19 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం చేసుకుంటారు.  గత ఎన్నికల్లో ఓటమి అనంతరం తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

యువ నాయకుడు, వైసీపీ అధినేత దూకుడును తట్టుకొని నిలబడగలరా అనే సందేహాలు.. కుమారుడు లోకేశ్ వారసత్వం అందుకోవడానికి ఇంకా ఆమడ దూరంలోనే ఉండిపోయారు. మోదీ కూడా పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో ఒంటరి పోరుతో ఆయన నెగ్గుకు రాగలరా.  వయసు సహకరిస్తుందా లాంటి ప్రశ్నలకు ఒక్కటే సమాధానం. టీడీపీకి అపూర్వ విజయం, మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబుకి ఇలాంటి ఒడిదొడుకులు కొత్తేమీ కాదు. రాజకీయాల్లో నెగ్గుకు రాగలగడానికి బలమైన ఆర్థిక నేపథ్యమేమీ లేదు. గాఢ్ ఫాదర్లు లేరు. వారసత్వ రాజకీయం చేయలేదు. మరి చంద్రబాబు విజయ రహస్యం ఏంటి.

ఎక్కడో మారుమూల ప్రాంతంలో జన్మించిన ఆయన ఆకాశంలో అంత ఎత్తుకు ఎలా ఎదిగారు. ఇదే కీలకమైన అంశం. ఆ శ్రీనివాసుడి కటాక్షం అని కొందరు అంటూ ఉంటారు. తలుపుతట్టిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని.. కాలం కలసిరావడం వల్ల అని మరికొంత మంది అనుకుంటారు. ఎవరెన్నీ అనుకున్నా చంద్రబాబు ఒక పజిల్. ప్రత్యర్థులకు అర్థం కాడు.

గాలికి ఎదురు ఈదుతున్న సమయంలో తన బలాన్ని అంచనా వేసే సమయాన్ని శత్రువుకి ఇవ్వరు. ఆట చివరి వరకు ఓటమి ఒప్పుకోరు. తన కథే ముగిసింది అని అందరూ భావించేలోపు సరికొత్త మలుపు తిప్పుతారు. అదును చూసి దెబ్బతీయడం అంటే ఇదే. అదే గెరిల్లా యుద్ధతంత్రం కూడా. ద కాప్టైల్ ఆఫ్ గెరిల్లా వార్ ఫైర్ ప్లస్ పంచతంత్రం ఈజ్ ఈక్వల్ టూ చంద్రబాబు విజయ రహస్యం. గెలవడం ముఖ్యం. గెలుపు కోసం ఎంచుకున్న మార్గాలు కాదు. ఇది గిట్టని వారు చంద్రబాబుని అవకాశవాది అంటుంటారు. కానీ ఇలాంటివాటిని ఆయన లెక్కచేయరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: