ఇక జగన్‌ పని అయిపోయినట్టేనా.. చిన్న లాజిక్‌ మిస్సయ్యారా?

బండ్లు ఓడలు అవుతుంటాయి. ఓడలు బండ్లు అవుతుంటాయి అంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు రాగా.. టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఐదేళ్లు వచ్చేసరికి అదే వైసీపీ 151 నుంచి 11  సీట్లకి పడిపోగా.. టీడీపీ కూటమి 23 నుంచి 164కి పెరిగింది. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. గతంలో టీడీపీని ఘోరంగా ఓడించిన ప్రజలు.. ఇప్పుడు వైసీపీని అంతకు మించి చావు దెబ్బ  కొట్టారు.

అయితే ఇప్పుడు అందర్నీ ఒక ప్రశ్న వేధిస్తోంది. వైసీపీ పని అయిపోయిందని.. ఇక ఆ  పార్టీకి భవిష్యత్తు లేదనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు,  ఆ పార్టీ అధినేత జగన్ వెళ్తారా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అసెంబ్లీకి వెళ్లకపోతే దానికి మించిన తప్పు, వైసీపీ చేసే పొరపాటు మరొకటి లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు వైసీపీ భవిష్యత్తుకి వచ్చే నష్టమేమీ లేదని వారు పేర్కొంటున్నారు. ఆ పార్టీకి సీట్లు తగ్గాయి కానీ 40శాతం ఓట్లు వచ్చాయి అని గుర్తు చేస్తున్నారు. ఏపీలో ఆ పార్టీని 40శాతం మంది ఆదరించారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 36 మాత్రమే.  ఇక తెలంగాణలో కాంగ్రెస్ 40శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చింది. కాబట్టి వైసీపీని తక్కువ అంచనా వేయడానికి లేదు. కాకపోతే సీట్లలో ఆ ప్రభావం గణనీయంగా ఉంది. ఏ రాజకీయ పార్టీకి భవిష్యత్తు లేకుండా ఉండదు. గతంలో 23 సీట్లు వచ్చిన టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.

ఇదే సమయంలో గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా రాని కాంగ్రెస్ ఈ సారి 99సీట్లు సాధించగలిగింది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి ప్రమాదం ఉండదు. పైగా వైసీపీకి 40శాతం మంది ప్రజలు ఉన్నారంటే మామూలు విషయం కాదు. ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపి.. ప్రజల గొంతుకే ప్రశ్నిస్తే వచ్చే ఐదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: