జగన్ లెక్కలు, బొక్కలు.. అన్నీ తవ్వుతున్న చంద్రబాబు?

అధికారం ఉన్నంత సేపు చుట్టూ వ్యవస్థలు వైఫైలా ఉంటాయి. అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు చేసిన తప్పులు, లొసుగులు కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి భిన్నంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోను కుంభకోణాలు వెలుగు చూశాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి.

సర్పంచులు జగన్ ప్రభుత్వం మోసం చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చి మరీ కేంద్ర ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించింది. అప్పట్లో బీఆర్వో విడుదల కావడంతో నిధుల కోసం సర్పంచులు ఎదురు చూశారు. అయినా రాకపోవడంతో రెండు రోజుల క్రితం ఆరా తీస్తే ప్రభుత్వ అవసరాల కోసం వాటిని దారి మళ్లించినట్లు తెలిసింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి రెండో విడతగా గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.998 కోట్లను ఈ ఏడాది మార్చిలో విడుదల చేసింది. ఇందులో దాదాపు రూ.700 కోట్లను గ్రామ పంచాయతీలకు కేటాయించింది.

కేంద్రం నిధులిచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజుల పాటు గోప్యంగా ఉంచింది. విషయం తెలిసి సర్పంచులు ఆందోళనకు దిగడంతో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు బీఆర్వో ఇచ్చింది. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఆగమేఘాల మీద బిల్లులను తయారు చేసి రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదిక పంపారు. ఈ మేరకు పంచాయతీల బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేయాలి.

సర్పంచుల ఆందోళనతో మెట్టు దిగిన బీఆర్వో ఇచ్చిన ఆర్థిక శాఖ.. ఆ తర్వాత పట్టించుకోలేదు. నిధులను ఇతర అవసరాలకు మళ్లించి పంచాయతీ రాజ్ శాఖ పంపిన బిల్లులను పక్కన పడేసింది. గతంలోను రూ.1250 కోట్లకు పైగా 14, 15 ఆర్థిక సంఘం నిధులను సర్పంచుల ప్రమేయం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీల బకాయిలకు మళ్లించడం గమనార్హం.  తాజాగా మరోసారి రూ.700 కోట్లను ప్రభుత్వ అవసరాల కోసం వాడుకొని సర్పంచులను మోసం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: