చంద్రబాబు చంపేస్తున్నారు.. ముర్మూజీ కాపాడండి తల్లో..?

ఏపీలో ఎన్నికల అనంతరం హింస చెలరేగింది.  అది ఫలితాలు వెలవడిన తర్వాత కూడా చల్లారలేదు. పలు చోట్ల పరస్పరం దాడులు, విగ్రహాల ధ్వంసాలు, శిలాఫలకాల కూల్చివేతలు, పేర్ల మార్పు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. ఏపీలో టీడీపీ అధికార పార్టీ కాబట్టి పోలీసుల మద్దతు సహజంగా వారికే ఉంటుంది.  ఈ సమయంలో వైసీపీ నాయకులు తమపై దాడులు జరుగుతున్నాయని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

అయితే ఫలితాల తర్వాత టీడీపీ దాడులపై వైసీపీ ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి ఫిర్యాదు చేశారు.  ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరినట్లు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.  వారం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఘర్షణలకు తెగబడుతున్నారని వెల్లడించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆరోపించారు.

ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చట్టం లేదు. స్వేచ్ఛ లేదు. అన్యాయమే రాజ్యం ఏలుతుందని వాపోయారు. కనీసం ఫిర్యాదు చేస్తామన్నకూడా పోలీసులు ఫిర్యాదులు తీసుకోవడం లేదని ఆరోపించారు. పోలీసు వ్యవస్థ నీరుగారిపోయిందని.. నిస్తేజంగా మారిపోయిందని పేర్కొన్నారు.

బాధితుల ఆక్రందనలను తెలుసుకోవాలని చంద్రబాబుకి సూచించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో టీడీపీ దాడులపై చర్యలు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఫలితాల అనంతరం జరిగిన దాడుల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారని, రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని విమర్శించారు. టీడీపీ దాడులపై ప్రధాని, హోం మంత్రి, ఎన్ హెచ్ ఆర్సీకి కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. మోపీదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని. కానీ కొన్ని రోజులుగా జరగుతున్న హింసాత్మక ఘటనలు బాధాకరమని అన్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులే కాకుండా ఇళ్లు సైతం కూలగొడుతున్నారని .. ఇలాంటి పరిస్థితులు ఏపీలో ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదన్నారు. తక్షణమే స్పందించి ఈ దాడులను ఆపాలని లేఖలు రాశామని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: