మోదీకి జీవితంలోనే కష్టకాలం.. చివరకు సొంతవాళ్లు కూడా?

ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. కానీ భారతీయ జనతా పార్టీకి ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్ గానే 350 పైగా స్థానాలు వస్తాయని భావించిన ఆ పార్టీకి మెజార్టీకి 32 సీట్ల దూరంలో నిలిచి పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ మోదీ తీరును ఎండగడుతూ వస్తోంది. తన ఎడిటోరియల్ కాలంలో ఎన్నికల ఫలితాల తీరును విశ్లేషించింది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసాన్ని కళ్లకు కట్టాయి. వారితో పాటు నేతలంతా గాలి బుడగను నమ్ముకొని పని చేసి.. మోదీపై ఆధారపడ్డారు. వీధుల్లో ప్రజల గొంతుకను పట్టించుకోలేదు.  ఆర్ఎస్ఎస్ క్షేత్ర స్థాయి పోరాట బలగం కాకపోయినా బీజేపీ  నాయకులు సంఘ్ స్వయం సేవకులు సహకారం తీసుకోలేదు. అంకిత భావంతో పనిచేసే పాత కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారు. వారికి బదులుగా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న వారికి ప్రాధాన్యమిచ్చారు. స్వీయ ప్రకటిత కార్యకర్తలను నమ్ముకోవడం వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయి.

ప్రధాని  మోదీ పిలుపునిచ్చిన 400కి పైగా సీట్ల లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు భావించారు. ఆయనవల్లే గెలుస్తామని నమ్మకంతో వారు పనిచేయలేదు అని తాను రాసిన వ్యాసంలో ఆర్ఎస్ఎస్ జీవితకాల సభ్యుడు రతన్ శార్ధా వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలో పనిచేయడం వల్లే లక్ష్యాలు సాధ్యం అవుతాయి అని సామాజిక మాధ్యమాలు, సెల్పీల ద్వారా కావని పేర్కొన్నారు.

513 స్థానాల్లో మోదీ పోటీ చేస్తున్నారన్న దానికి కొంత విలువే ఉంటుంది. ఇటు వంటి ఆలోచన స్వీయ పరాజయానికి దారి తీస్తుంది. స్థానిక నాయకులను తక్కువ చేసి చూడటం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడం బాగా పనిచేసిన ఎంపీలకు టికెట్లు ఇవ్వకపోవడం వంటివి వికటించాయి. టికెట్లు ఇచ్చిన వారిలో 25శాతం మంది వలసనేతలే. అనవసర రాజకీయం కూడా పార్టీని దెబ్బతీసింది. దీనికి ఉదాహరణ మహారాష్ట్ర. అక్కడ పార్టీలను చీల్చడం అనవసరం. బీజేపీ, శివసేనలకు బలం ఉన్నా అజిత్ పవార్ ను చేర్చుకోవడం తప్పిదమే. దీనివల్ల బీజేపీ నేతలు మనస్తాపం చెందారు. ఒక్క దెబ్బతో అన్నీ పార్టీల మాదిరి బీజేపీ మారిపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న కోట కూలిపోయింది అని శార్ధా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: