మోదీ సార్‌.. మీరు మారిపోయారు సార్‌..? పూర్తిగా మారిపోయారు సార్‌?

2014, 19 లోక్ సభ ఎన్నికల్లో మిత్ర పక్షాల అవసరం లేకుండానే కేంద్రంలో బీజేపీ సొంతంగా మెజార్టీ సీట్లను గెలుచుకుంది. 2019లో అయితే ఏకంగా 303 స్థానాలతో దుమ్ము లేపింది. 2024 ఎన్నికలకు వచ్చే సరికి సొంతంగా అవసరమైన 272 స్థానాల కంటే తక్కువగా 240 సీట్లకే పరిమితం అయింది.  మెజార్టీకి 32 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో మిత్ర పక్షాల చేరిక అనివార్యం అయింది.

అయితే మోదీ గతంలో గుజరాత్ సీఎంగా  పనిచేసినా.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సింగిల్ గానే మెజార్టీ సాధించగలిగారు. కానీ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం రావడంతో ప్రధాని ఎలా నెగ్గుకు వస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయనకు సంకీర్ణ ప్రభుత్వాలు నడిపే అనుభవం లేదని పలువురు పేర్కొంటున్నారు. అయితే గత పదేళ్లుగా ప్రధాని వ్యవహరించిన తీరు గమనించిన వారికి మోదీ మొండితనం బాగా తెలుసు. తాను అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. కానీ ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. ఏదైనా మిత్ర పక్షాలతో చర్చించాల్సిందే.

మోదీలో మిగతా రాజకీయ నాయకులతో పోల్చితే కొన్ని స్కిల్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. మనం కొన్ని అంశాలను గమనిస్తే మోదీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఏర్పాటు చేసిన సమావేశంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ ని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని పక్కనే కూర్చోబెట్టుకున్నారు.  పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన బీజేపీ భాగస్వామ్య పార్టీల సమావేశంలో మిగతా వారి గురించి ఆకాశానికెత్తారు.

మంత్రి వర్గ కూర్పులో కూడా తన చాణక్యాన్ని ప్రదర్శించారు. దీనిపై శిందే శివసేన, అజిత్ ఎన్సీపీ లు తప్ప మిగతా వారెవరూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. వీరు తప్ప మిగతా పార్టీలు తమ శాఖలపై సంతృప్తి కరంగానే ఉన్నాయి. దీంతో పాటు పార్టీలోని సీనియర్లకు తగిన స్థానం కల్పించారు. నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. వీరిద్దరూ మోదీని సమానంగా ప్రశ్నించే సామర్థ్యం ఉన్న నేతలు. అయితే వీరి ప్రాధాన్యం తగ్గించకుండా మోదీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవన్నీ మోదీ మార్పులే అని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: