ఆమె పోటీ చేస్తే.. మోడీ తప్పకుండా ఓడిపోయేవారా?

లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాయ్ బరేలీలో మొదటి సారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన కృతజ్ఞత కార్యక్రమంలో ఓటర్లనుద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోదరి ప్రియాంకా గాంధీ వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీని రెండు నుంచి మూడు లక్షల ఓట్లతో ఓడించే వారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారణాసి నుంచి మోదీ 2014 నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 19తో పోలిస్తే 2024లో గెలుపు మార్జిన్ తక్కువగా ఉంది. ఇటీవల రాయ్ బరేలీ నుంచి మూడు లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థిని ఓడించిన రాహుల్ గాంధీ, మోదీని ఉద్దేశిస్తూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

తాను అహంకారంతో ఈ మాటలు అనడం లేదని.. మోదీ రాజకీయాలు తమకు నచ్చడం లేదని దేశ ప్రజలే ఆయనకు సందేశం పంపారని.. అందుకే తాను ఈ మాట చెబుతున్నట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగా నరేంద్ర మోదీని ఓడించే సత్తా ప్రియాంక గాంధీ కి ఉంటే ఆమెను పోటీకి ఎందుకు దింపలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంటే మోదీని గెలిపించేందుకు కాంగ్రెస్ యత్నించిందా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోందని గుర్తు చేస్తున్నారు.

మోదీ ఓడిపోయే సూచనలే ఉంటే రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడించి ఉంటే ప్రస్తుతం సమీకరణాలు వేరే విధంగా ఉంటాయి అని విశ్లేషిస్తున్నారు. కాబట్టి ఎన్నికలు అయిన తర్వాత ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం లేదని తేల్చి చెబుతున్నారు. పైగా మోదీకి మెజార్టీ తగ్గింది కానీ ఓట్ల సంఖ్య కాదని గుర్తు చేస్తున్నారు. మోదీని 2014, 19లో బలపరిచిన ఓటర్లే మరోసారి అంతే స్థాయిలో ఓటు వేశారు. కాకపోతే వ్యతిరేక ఓట్లు పోలరైజేషన్ ఈ సారి బలంగా జరిగింది. అందువల్ల మోదీ మెజార్టీ తగ్గింది తప్ప.. ఓటర్లు కాదు అని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: