మోడీ.. ఇక చంద్రబాబు చేతిలో కీలుబొమ్మేనా?

కేంద్రంలో రెండు సార్లు సంపూర్ణ మెజార్టీ సాధించిన బీజేపీ పదేళ్ల పాటు ఎలాంటి అడ్డంకులు లేకుండా పరి పాలన సాగించింది. మరి ఈ సారి సొంతంగా అధికారానికి మేజిక్ ఫిగర్ దాటలేకపోయిన బీజేపీకి మిత్ర పక్షాలు షాక్ ఇవ్వనున్నాయా.  మోదీకి తలనొప్పులు తప్పవా..  ఈ సారి లోక్ సభలో బిల్లులకు అడ్డంకులు తప్పవా అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి.

వరుసగా మూడో సారి ప్రధానిగా ఎన్నికైన మోదీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ పరిస్థితి సుస్థిరంగా ఉందని చెప్పడానికి పాత, కొత్త అనుభవజ్ఞుల కలబోతతో మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీకి గత పదేళ్ల పాలనలో సొంత మెజార్టీ వచ్చినా మిత్ర పక్షాలకు అవకాశం కల్పించారు. కానీ నిర్ణయాలు మాత్రం స్వతంత్రంగా ఉండేవి కావు. స్పష్టంగా చెప్పాలంటే ఏకపక్షంగా మోదీ-షాలు నిర్ణయాలు తీసుకునేవారు. ఈసారి మాత్రం ఆ అవకాశం ఇసుమంతైనా ఉండకపోవచ్చు. సమష్టి నిర్ణయాలు తప్పనిసరి.
 
ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా భాగ స్వామ్య పక్షాలను ఒప్పించాలి. వారి ఆమోదం పొందాలి. ఆయన గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు, ప్రధానిగా 10 ఏళ్లు నడిచిన తీరు ఒక ఎత్తు అయితే రానున్న ఐదేళ్లు మరో ఎత్తు. ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలగా ప్రాంతీయ పార్టీలే ఎక్కువగా ఉన్నాయి. తమ రాజకీయ మనుగడకు, రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం వాటిల్లినా బయటకు వచ్చే ప్రమాదం ఉంది.  

అయితే ప్రధాని మోదీ ఈ పార్టీలన్నింటిని సమన్వయం చేయాల్సి ఉంది. ఇదే క్రమంలో ఆ పార్టీ ఆయువు పట్టు రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ పార్టీ పటిష్ఠత కోసం కృషి చేయాల్సి ఉంది. వీటిని సరిదిద్దుకుంటేనే ఐదేళ్లు సంకీర్ణ ప్రభుత్వం సక్రమంగా నడుస్తుంది. ఎందుకంటే వచ్చే రెండేళ్లలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ ఓడిపోతే ఆ పార్టీపై ఎన్డీయేపై భాగస్వామి పక్షాలకు నమ్మకం పోతుంది. తద్వారా ఎన్డీయే కూటమి అధికారం కోల్పోతుంది.  ఏది ఏమైనా వచ్చే ఐదేళ్లు నరేంద్ర మోదీకి, అమిత్ షాలకి నిత్య కష్టాలే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: