జీతం పెరిగింది.. ఖర్చు పెరిగింది.. ఆనందం కరువైంది?

ప్రజల జీతాలు పెరుగుతున్నాయి. సంపాదన కూడా పెరుగుతుంది. ఇదే సమయంలో బతుకుదెరువు కూడా భారం అవుతుంది. ఖర్చులు విపరీతంగా అవుతున్నాయి. ప్రస్తుతం సేవింగ్స్ పై ఎవరూ దృష్టి సారించడం లేదు. తమ సౌకర్యం కోసం అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా వస్తువులను కొనేస్తున్నారు. అధికంగా ఖర్చు చేస్తూ.. డబ్బులను దాచాలనే ఆలోచనే రానివ్వడం లేదు.

తాజాగా పెరిగిన గృహ అవసరాల వినియోగ వ్యయం గురించి ఓ నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. దేశంలో వినియోగ వ్యయంలో సామాజిక వర్గాల మధ్య అంతరాయం క్రమేపీ తగ్గుతోంది. దశాబ్ద కాలంలో సగటు అవసరాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ మేరకు జాతీయ గృహ అవసరాల వినియోగ వ్యయ వేదిక గడిచిన 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో దేశ పౌరులు గృహ అవసరాల కోసం వెచ్చిస్తున్న వ్యయాన్ని అధ్యయనం చేసింది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వినియోగ వ్యయం 9.2 శాతం పెరిగింది. ఇతర వర్గాల వ్యయం 8.5శాతం మేర ఎక్కువ అయింది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో గృహ అవసరాల వినియోగ వ్యయం అధికంగా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. 2011-12లో గ్రామీణ సగటు కుటుంబ వినియోగ వ్యయం రూ.1431లు ఉండగా.. అది 2022-23 నాటికి రూ.3773కి పెరిగింది. ఇందులో అన్ని సామాజిక వర్గాలు కూడా ఖర్చులు అధికంగా చేస్తున్నాయి.

ఒకప్పుడు ఎస్టీ కుటుంబం రూ.1120 లు ఖర్చు చేస్తే నేడు రూ.3016 వరకు వెచ్చిస్తున్నారు.  ఎస్సీ లు రూ. 1252 నుంచి రూ.3474, బీసీలు రూ.1439 నుంచి రూ.3838 వరకు ఖర్చులు పెంచారు. ఇక ఇతరులు రూ. 1719 నుంచి రూ.4392 వరకు వెచ్చిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్టీలు రూ. 2093 నుంచి రూ.5014, ఎస్సీలు రూ.2028 నుంచి రూ.5307, బీసీలు రూ.2275 నుంచి రూ.6177, ఇతర వర్గాలు రూ.3772 నుంచి రూ.7333 వరకు ఖర్చులు పెంచుకొచ్చారు. ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి. సంపాదన పెరుగుతుంది. కానీ అధికంగా సంపాదిస్తున్నామన్న ఆనందం ఎవరిలోను కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: