రాజధాని విషయంలో బాబు ఇలా చేస్తే సూపర్‌ సక్సస్‌?

ఏపీ విభజన అనంతరం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.  అమరావతి రాజధాని ప్రాంతం కావడంతో 2014 నుంచి 2019 వరకు ఇక్కడ స్థిరమైన కట్టడాలు, పెద్ద పెద్ద భవనాలను నిర్మించారు. 2019లో అధికారం మారింది.  కొత్త ప్రభుత్వం ఆలోచనతో అమరావతిలో కొనసాగుతున్న పనులు నిలిచిపోయాయి. మూడు రాజధానులు అనే కొత్త కాన్సెప్ట్ ను తాజా మాజీ సీఎం జగన్ తెరపైకి తెచ్చారు. దీంతో అమరావతి లో నిర్మాణ పనుల్లో, అభివృద్ధిలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది.   జరగుతున్న పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో రైతులు సమ్మె చేసి కోర్టులను ఆశ్రయించారు.  సమ్మెలు, దీక్షలు, పాదయాత్రలు , కోర్టు తీర్పులు, స్టేలు ఇలా ఐదేళ్లు అత్యంత ఘోరంగా గడిచాయి.

తిరిగి 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. తిరుగులేని మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు.  ఏ విధంగా అంటే చంద్రబాబు తీసుకునే నిర్ణయాలను ప్రతిపక్ష నేతలు ప్రశ్నించలేనంత మెజార్టీని ఆయనకు అప్పజెప్పారు. 91శాతం  భారీ విజయాన్ని ఏకపక్షంగా ఇచ్చేశారు.  ఏది కోరుకుంటే అది చేసేయొచ్చు. ఈ సమయంలో ప్రజల ఆకాంక్షలను తీర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై, కూటమి నేతలపై ఉంది.

అమరావతి అంటే కేవలం 29 గ్రామాలే కాదు. విజయవాడ, గుంటూరు లను కూడా కలిపితే ఒక మహా నగరంగా అమరావతి రూపొందుతుంది. గతంలో విజయవాడ, గుంటూరు పక్కన పెట్టడం వల్లే టీడీపీ పై వ్యతిరేకత వ్యక్తం అయింది. అది 2019 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వీటిని జగన్ కలుపుతారు అని స్థానిక ప్రజలు ఆలోచిస్తే అసలు అమరావతే రాజధాని కాదన్నారు. దీంతో ప్రజలు వైసీపీని దారుణంగా గద్దె దించారు. మళ్లీ ఇప్పుడు గతంలో చేసిన తప్పుని చేయకుండా అమరావతిలో గుంటూరు, విజయవాడలను కలిపితే అద్భుత ప్రయోజనం ఉంటుంది ఆ విధంగా చంద్రబాబు ఆలోచన చేయాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: