ఆట మొదలు పెట్టిన చంద్రబాబు.. త్వరలో ఆ వైసీపీ మంత్రి అరెస్ట్?

వైసీపీ సీనియర్ లీడర్, ఉత్తరాంధ్ర కీలక నేత బొత్స సత్యనారాయణ మీద ఏసీబీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. విద్యా శాఖ మంత్రిగా ఉన్న బొత్స అక్రమ బదిలీల విషయంలో అడ్డంగా దొరికారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీచర్ల బదిలీ విషయంలో బొత్స లీలలు అన్నీ ఇన్నీ కావు అని టీడీపీ నేతలు ఘాటుగా విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక్కో టీచర్ నుంచి రూ. మూడు నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసినట్లు ఆ మొత్తం కలిపితే రూ.65 కోట్లు అని టీడీపీ నేతలు లెక్కలు చెబుతున్నారు. ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం తమ్ముళ్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.

బొత్స విద్యా శాఖలో చేసిన అక్రమ బదిలీల నిర్వాకం మీద వారు అందులో పూర్తిగా తెలియజేశారు. ఒక వైపు ఎన్నికల కోడ్ వచ్చాక కూడా ఈ అక్రమ బదిలీలకు తెర లేపారు అని విమర్శించారు. ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి రాకముందే ఏసీబీ అస్త్రం ప్రయోగించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశం అయింది. గతంలో వైసీపీ కూడా ఏసీబీని పదునైన అస్త్రంగా మలచుకొని ఎంతో మంది టీడీపీ నేతలపై కేసులు పెట్టించింది. వారిలో అనేక మందిని అరెస్ట్ చేశారు కూడా. ఇప్పుడు అదే రూట్లో టీడీపీ కూడా సాగుతోంది.

బొత్సకు డబ్బులు ఇచ్చిన ఉపాధ్యాయులు కూడా బాహాటంగానే చెబుతుండటం ఆయనకు తలనొప్పిగా మారింది. ఎన్నికల ముందు రూ.65 కోట్ల వరకు ఆయన పేషీ అధికారులు వసూలు చేశారు. అయితే సిఫార్సు చేసిన ఈ తరహా బదిలీలు ఆపేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేయడంతో ఆ బదిలీలు ఆగిపోయాయి.  మరోవైపు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యే నేరుగా ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేయడంతో ఇక బొత్స అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: