బాబు చేతిలో మోదీ జుట్టు.. ఏపీ గుజరాత్‌ను మించిపోతుందా?

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీకి కీలకమైన నాయకులు బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడులు. వీరు ఇద్దరూ లేకపోతే ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే వారు కాదు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ముందుగానే వీరితో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది అని విశ్లేషకులు అంటున్నారు.

దీంతో వీరిద్దరూ మోదీకి జై కొట్టారు. పీఠాన్ని ఎక్కించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఎన్డీయే కూటమిలో చంద్రబాబు చక్రం తిప్పుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. పైగా కూటమి కన్వీనర్ బాధ్యతలు సైతం చంద్రబాబుకి ఇస్తారనే ప్రచారం ఆయన అనుకూల మీడియాలో సాగింది. కేంద్రంలోని ప్రభుత్వం ఏపీ ఎంపీలపై ఆధారపడటం ఏపీ ప్రజలకు శుభ సూచికమే. గతంలో తాజా, మాజీ సీఎం జగన్ అన్న మాదిరిగా మన ఎంపీలపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని ఆకాంక్షించారు. ఇది ఇప్పుడు నిజం అయింది.

దీనిని అవకాశంగా మలుచుకొని చంద్రబాబు మంత్రి పదవుల విషయంలో కీలకమైన శాఖలు అడుగుతారని.. స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నారనే గుసగుసలు వినిపించాయి. వీటన్నింటిని బేఖాతరు చేస్తూ ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి టీడీపీకి లభించాయి. ఈ విషయంలో చంద్రబాబు వ్యూహం మరోలా ఉందనేది విశ్లేషకులు వాదన. ప్రస్తుతం ఏపీ పీకల్లోతు అప్పుల్లో ఉంది. పైగా చంద్రబాబు భారీ ఎత్తున సంక్షేమ పథకాలను ప్రకటించారు.

వీటికి నిధులు కావాలంటే మంత్రి పదవులు కన్నా కూడా నిధులే ముఖ్యం. పైగా కేంద్రంతో సఖ్యతగా ఉడి పలు పరిశ్రమలను ఏపీకి తీసుకురావాలనేది ఆయన ఆలోచన. ఉపాధి కల్పన లేకపోవడం వల్లే జగన్ ఓటమి పాలయ్యారు అనేది మెజార్టీ వర్గీయుల మాట. అందుకే చంద్రబాబు గుజరాత్ మాదిరిగా ఏపీని అభివృద్ధి చేసి పలు పరిశ్రమలను ఇక్కడికి తీసుకువచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నారు.  ప్రధాన పరిశ్రమలు నెలకొల్పి ఏపీని గుజరాత్ కి దీటుగా నిలపాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: