కౌం ట్రిక్స్‌: వైసీపీ న్యాయ పోరాటం ఫలించేనా?

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై వైసీపీ సుప్రీంకోర్టులో సవాలు చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్‌ అధికారి సంతకం ఉంటే చాలని.. సీలు, స్టాంపు అవసరం లేదని ఈసీ ఇప్పటికే ఆదేశాలిచ్చింది. దీంతో ఇప్పటికే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోము అని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ తీర్పును వైసీపీ సవాలు చేస్తోంది. అయితే.. ఈ వ్యవహారంలో తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం  తీసుకోవాలని ప్రతివాది, తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కూడా కేవియట్ దాఖలు చేశారు.

పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో తప్పులు ఉన్నాయని అనుకుంటే...  అవసరమైతే ఎన్నికలు తరువాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని హైకోర్టు ఈ విషయంలో వైసీపీకి సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకొనేది లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. ఈడివిజన్ బెంచ్ ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. ఆ తీర్పు కోసం ఎదురు చూస్తోంది.

అయితే.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ నిర్ణయం అనైతికమని, దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో చెప్పారు.  ఓట్ల లెక్కింపుపై ఈసీ గత ఏడాది స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ‘పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సీలు లేకుంటే హోదా వివరాలుండాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

తీరా ఇప్పుడు పోలింగ్ అయ్యాక అవి అవసరం లేదనడం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి  పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఇష్యూ లో సుప్రీంకోర్టుకు వెళ్తున్నామన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలని దేశ వ్యాప్తంగా నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
అధికారి సీలు, స్టాంపు లేకుంటే.. ఎవరైనా దొంగ సంతకం పెడితే ఆ ఓటు సంగతి ఏంటని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇలా దొంగ ఓట్లను ప్రోత్సహించేలా ఈసీ ఆదేశాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: