మళ్లీ జగనన్నే: పద్మవ్యూహంలో అభిమన్యుడు కాదు.. అర్జునుడు?

ఏపీలో మరో సారి వైసీపీ జెండా రెపరెపలాడబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జగన్ కళ్లలో ధీమా.. వైసీపీ నేతల్లో నమ్మకం చూస్తుంటే ఏపీలో మరోసారి సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అంటున్నారు. జగన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కబోతుందనే ఈ విషయంలో వైసీపీకి తిరుగులేదని తెలుస్తోంది.

కూటమి ఎన్ని పథకాలు ప్రకటించినా.. ఎన్ని మాయ మాటలు చెప్పినా అవి ఆచరణ సాధ్యం కానివి అని ఏపీ ప్రజలు విశ్వసిస్తున్నారు. పైగా జగన్ కూటమి మ్యానిఫెస్టోకి లెక్కలతో సహా వివరించి చెప్పడంతో ప్రజల మబ్బులు తొలిగిపోయాయి. రూ.75 వేల కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానని చెబుతున్న జగన్.. చంద్రబాబు హామీలు అమలు చేయాలంటే రెట్టింపు నిధులు అవసరం అని ప్రజలకు వివరిస్తున్నారు. మరి ఇప్పుడు ఏపీ మరో శ్రీలంక కాదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు మోసపు హామీలను ఏపీ ప్రజల కళ్లకు కట్టినట్లు చూపించడంతో  సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులంతా వైసీపీకే అనుకూలంగా ఉన్నారు.

ఎంత లేదనుకున్నా వైసీపీకి కనీసం 110 సీట్లు వరకు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాల లబ్ధి పొందని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే ఓటు వేయండి అంటూ ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లారు.

సిద్ధం సభల దగ్గర నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర వరకు అదే ఉత్సాహం.. అదే ఆశేష జనవాహిని మధ్య జగన్ తన ప్రచారాన్ని కొనసాగించారు. ప్రత్యర్థులతా ఒక వైపు ఉంటే.. జగన్ మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ లా ఫైట్ చేశారు. దీనికి కారణం జగన్ కి ప్రజలపై ఉన్న నమ్మకమే అని వైసీపీ నేతలంటున్నారు. మరోవైపు ఎన్నికల్లో కీ ఓటర్లుగా ఉన్న మైనార్టీలంతా గంపగుత్తగా వైసీపీకి మద్దతు తెలపడంతో వైసీపీ గెలుపు నల్లేరు పై నడకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద జగన్ ను సీఎం చేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: