దేశంతో హంగ్‌.. ఇందుకే కేసీఆర్‌ను చాణక్యుడు అంటారా ?

శాసన సభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతంతో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. తిరిగి పుంజుకునేందుకు తన శాయ శక్తులా కృషి చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కొని ఆ పార్టీని బలహీన పరచాలని సీఎం రేవంత్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీని, నాయకులను కాపాడుకునేందుకు గులాబీ బాస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం కేసీఆర్ బస్సు యాత్ర పేరిట లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీలో జవసత్వాలు నింపి.. గౌరవ ప్రదమైన స్థానాలు గెలవాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. అయితే అధికారం రావడంతో కాంగ్రెస్ అనూహ్యంగా బలపడింది. ఇదే సమయంలో బీజేపీ కూడా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రాభవం క్రమక్రమంగా క్షీణిస్తోంది.  పార్టీకి పునర్ వైభవం రావాలంటే లోక్ సభ ఎన్నిక్లలో బీఆర్ఎస్ పార్టీకి గణనీయమైన సీట్లు రావాలి.

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది సాధ్యం కాదేమే అనిపిస్తోంది. అందుకే కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశారు. దేశంలో హంగ్ రాబోతుంది అని.. 12 సీట్లు మనం సాధిస్తే కేంద్రంలోకి చక్రం తిప్పవచ్చని.. ఆయా రాజకీయ కూటములు మన దగ్గరకి వస్తే .. మన రాష్ట్రానికి కావాల్సింది అడిగి సాధించుకోవచ్చు అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

అయితే దీని వెనుక రాజకీయ వ్యూహమే కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలు కాబట్టి అధికారం కోసం సీట్లు అడుగుతాయి. మరి బీఆర్ఎస్ ఏ ఎజెండాపై సీట్లు అడగాలి. అందుకే రాష్ట్ర ప్రయోజనాల పేరిట హంగ్ అనే కొత్త నినాదాన్ని ఎత్తుకున్నారు. వాస్తవానికి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను మూసి వేశారు. ఒకవేళ దేశంలో హంగ్ వచ్చినా కేసీఆర్ చేసేదేమీ ఉండదని..ఆయన ప్రభావం శూన్యమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ ఎత్తుగడను తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: