అఫిడవిట్లు చెప్పిన రహస్యాలు: జనం సొమ్ము తిని తెగ బలిసిన నేతలు?

ఏపీ, తెలంగాణలో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎవరికీ టికెట్ దక్కుతుందో ఎవరు పోటీలో ఉంటారో తెలిసిపోయింది. పార్టీ అధినేతల నుంచి బీఫారాలు అందుకున్న నేతలు శుభ ముహూర్తానా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో వారి ఆస్తులు, అప్పుల వివరాలు బయటపడుతున్నాయి. కేసుల రూపంలో నేర చరిత్ర సైతం బయట పెట్టాల్సి వస్తోంది.

అయితే ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో చాలా మంది శ్రీమంతులు ఉన్నారు. అందులో టాప్ ఎవరు? లాస్ట్ ఎవరు అనే దానిపై ఆసక్తికర  చర్చ నడుస్తోంది. ఒకరికి మించి ఒకరి ఆస్తులు బయటపడుతుండటంతో హాట్ టాపిక్ గా మారిపోతుంది. దీంతో అసలు సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు లేవా అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఓ సామాన్య పార్టీ కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గుకురాగలరా కచ్చితంగా లేదు అనే సమాధానం వినిపిస్తోంది.

ఒక లోక్ సభ సెగ్మెంట్ లో పోటీ చేయాలంటే కనీసం రూ.50 నుంచి 100 కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అసెంబ్లీ ఖర్చుకూడా ఇంచుమించు ఇదే తరహాలో ఉంటుంది. ఇంత ఖర్చు ప్రజలకు మేలు చేసే వారు భరించలేరు. దీంతో వ్యాపార వేత్తలు టికెట్ ఆశించి.. పార్టీకి ఎంతో కంత ఫండ్ అప్పజెప్పి టికెట్ దక్కించుకుంటున్నారు. వీరంతా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజా సమస్యలపై పోరాడతారా అంటే ఎంతమంది నమ్ముతారు.

ఒక వేళ అభ్యర్థి గెలిచినా పార్టీ అధికారంలోకి రాకపోతే ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. ఎందుకు అంటే ఆస్తుల సంరక్షణ కోసం. తన వ్యాపార కార్యాకలాపాలకు ఎక్కడ ఇబ్బందులు సృష్టిస్తారో అనే భయంతోనో..  ఇంతకుముందు వ్యాపార వేత్తలు, సంపన్నులను పెద్దల సభకు పంపించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. వీరంతా ఇప్పుడు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. వారికి రూ.50 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద సమస్యేమీ కాదు. రానురాను ప్రజాస్వామ్యం ధనస్వామ్యం గా మారిపోయే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: