జంపింగ్, రేవంత్‌ రికమెండేషన్‌తో టిక్కెట్‌: గుమ్మనూరు గెలుస్తారా?

గుమ్మనూరు జయరాం..  ప్రజారాజ్యం నుంచి ప్రస్థానం ప్రారంభించిన బోయ సామాజిక వర్గం నేత ఈయన. అప్పట్లో ఆలూరు నుంచి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి మొదటిసారి గెలిచారు. ఆ తర్వాత 2019లో రెండోసారి నుంచి వైసీపీ నుంచి గెలిచి.. ఈసారి ఏకంగా మంత్రి అయిపోయారు గుమ్మనూరు జయరాం.

కానీ మంత్రి అయ్యాక.. ఆయనపై అవినీతి ముద్ర బాగా పడింది. బెంజ్‌ మంత్రి బెంజ్‌ మంత్రి అంటూ టీడీపీ నేతలే ఎన్నోసార్లు విమర్శలు చేశారు. ఈయన అవినీతిపై ఎల్లో మీడియాగా పేరున్న ఓ ప్రధాన పత్రిక ఎన్నోసార్లు కథనాలు ఇచ్చింది. అందుకే జగన్ సర్కారులో మంత్రి అయినా మళ్లీ టికెట్‌ ఇస్తే గెలుస్తారన్న నమ్మకం జగన్‌కు కలగలేదు. అందుకే ఆయనకు టికెట్‌ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు. గుమ్మనూరు జయరాంపై ఉన్న ప్రజావ్యతిరేకత దృష్ట్యా అసెంబ్లీకి కాకుండా కర్నూలు పార్లమెంటుకు పోటీ చేయించాలని ఆలోచించారు.

ఆ విషయం తెలియగానే గుమ్మనూరు జయరాం వెంటనే మేలున్నారు. టీడీపీని సంప్రదించారు. అయితే అక్కడ టికెట్‌ ఖాళీ లేదు. దీంతో ఎలాగైనా టీడీపీ టికెట్‌ దక్కించుకోవాలనుకున్న గుమ్మనూరు జయరాం చివరకు తన సోదరుడైన బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి అయిన  నాగేంద్రతో రేవంత్‌ రెడ్డి ద్వారా చెప్పించుకుని టీడీపీ గుంతకల్లు టికెట్‌ పొందాడని చెబుతారు. గత ఐదేళ్లుగా తామే గుమ్మనూరు జయరాంను అత్యంత అవినీతి పరుడైన మంత్రిగా విమర్శించినా.. చివరకు ఈ నేతను టీడీపీ అక్కున చేర్చుకుంది. గుంతకల్లు టికెట్‌ ఇచ్చి ఆదరించింది.

అయితే గుమ్మనూరు జయరాంకు అక్కడ పరిస్థితి కూడా అంత ఈజీగా ఏమీ లేదు. గుంతకల్లు లోకల్‌ టీడీపీ క్యాడర్‌ నుంచి అంతగా సహకారం అందట్లేదు. దీనికి తోడు ఇక్కడ వైసీపీ నుంచి బరిలో ఉన్న వై. వెంకట్రామిరెడ్డి కూడా స్ట్రాంగ్‌ లీడర్. దీంతో గుమ్మనూరు జయరాం ఏటికి ఎదురీదుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: