జగన్‌: అనూహ్యంగా బ్రహ్మాస్త్రం అందివచ్చిందిగా?

కృష్ణానది యాజమాన్య బోర్డు కు ప్రాజెక్టుల అప్పగింత, నీటి వాటాల సంగతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దాదాపు యాభై ఏళ్ల క్రితం గొడమే మళ్లీ రాజుకోవడానికి కారణం అయింది. ఇప్పటి దాకా ఇది తెలుగు రాష్ట్రాల మధ్యే ఉండగా.. ఇప్పుడు పాలక, ప్రతిపక్షాలకు పాకింది. దీనిపై రాజకీయ లబ్ధి పొందాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.

ఇటు ఏపీ ప్రభుత్వం.. అటు తెలంగాణ ప్రభుత్వం మా వాటానే వాడుకొంటున్నామని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు, తమ కు మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి కేంద్రం జారీ చేసిన విధివిధానాలు పై ఎస్ఓసీ దాఖలు చేసేందుకు జూన్ చివరి వరకు గడువు పొడిగించాలని ఏపీ విజ్ఙప్తిని జస్టిస్ బ్రిజేశ్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యూనల్-2 తిరస్కరించింది. ఈ నెల 29లోగా ఎస్ఓసీని దాఖలు చేయాలని ఆదేశించింది.

మే 15 నుంచి 17 వరకు తదుపరి విచారణ నిర్వహిస్తామని ట్రిబ్యూలన్ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యూలన్ గంపగుత్తుగా కేటాయించిన 811 టీఎంసీలతో పాటు ఇతర కేటాయింపులను..ఏపీ తెలంగాణ మధ్య పునఃపంపిణీ కోసం కృష్ణా ట్రిబ్యూనల్-2 అదనపు విధివిధానాలు టీఓఆర్ జారీ చేస్తూ కేంద్రం అక్టోబరు 10న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ దిల్లీలో సమావేశం అయి అదనపు టీఓఆర్ పై విచారణ చేపట్టింది.
రాష్ట్రంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున స్టేట్ మెంట్ సమర్పించడానికి మరికొంత సమయం కావాలని ఏపీ కోరింది. స్టేట్ మెంట్ సమర్పించడానికి జూన్ వరకు ఇవ్వాలన్న ఏపీ వాదనను ట్రిబ్యూనల్ తోసిపుచ్చింది. వాదనలు సమర్పించిన తర్వాత రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఇరు రాష్ట్రాలకు ట్రిబ్యూనల్ ఆదేశించింది. అయితే దీనిపై ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో మంచి అవకాశం లభించిందని మా వాటా మేం వాడుకున్నాం అని బలంగా వాదనలు వినిపిస్తే.. ఈ అంశం ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: