పవన్‌,లోకేశ్‌: అసెంబ్లీలో అడుగుపెట్టే యోగం ఈసారీ లేదా?

వారిద్దరి లక్ష్యం ఒకటే. భవిష్యత్తులో ఏపీకి సీఎం అవ్వాలనేది వారి కోరిక.  దాని కన్నా ముందు ఎమ్మెల్యేగా గెలవాలి.   గత ఎన్నికల్లో పోటీ చేసినా అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం రాలేదు. ఈసారి అయినా  ఆ అవకాశం లభిస్తుందో లేదో అని ఆ నియోజకవర్గాలకే పరిమితం అవుతూ ప్రచారం చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా.. రెండు రెండు మాత్రం ఆసక్తిగా మారాయి. అవే పిఠాపురం, మంగళగిరి. ప్రస్తుతం ఈ రెండింటి గురించి ఏపీకి చెందిన వారితో పాటు రాజకీయాల పై అభిరుచి ఉన్నవారు ఎక్కడ కలిసినా మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ రెండు ఇంత హాట్ టాపిక్ లా మారడానికి కారణం అందరికీ తెలిసిందే. పిఠాపురం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీలో ఉండగా. మంగళగిరి నుంచి నారా చంద్రబాబు తనయుడు లోకేశ్ వరుసగా రెండో సారి బరిలో నిలుస్తున్నారు.

ఇక ఈ ఇద్దరూ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వారే కావడం గమనార్హం. అయినా పార్టీని నడిపిస్తున్నారు. ఇప్పుడు వీరికి గెలుపు అనివార్యంగా మారింది. వీరి గెలుపు అనుకున్నంత సులభం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థి, అధికార పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అనేక సమీకరణాలను బేరేజు వేసుకొని బలమైన నాయకులను బరిలో దింపింది.

ఇంకో విచిత్రం ఏమిటంటే ఇద్దరి మీద మహిళా అభ్యర్థులే బరిలో ఉండటం విశేషం.  మరోవైపు వైసీపీ మంగళగిరిలో గెలుపు కోసం ఆళ్ల రామకృష్ణరెడ్డి, గంజి శ్రీనివాస్, అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పనిచేస్తున్నారు. పిఠాపురం నుంచి కూడా నలుగురు కీలక నేతలను రంగంలోకి దింపింది. మరోవైపు టీడీపీ, జనసేన నుంచి ఈ స్థాయిలో కసరత్తులు కనిపించడం లేదు. ఇప్పటి వరకు అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో ఎవరూ కష్టపడని రీతిలో ఇరు పార్టీల నాయకులు చెమటలు చిందిస్తున్నారు. మరి వీరిలో ఇద్దరూ గెలుస్తారా.. లేదా వీరిలో ఒక్కరే గెలుస్తారా.. ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: