జగన్‌: లిక్కర్‌ వ్యూహంతో బాబుకు ఊహించని దెబ్బ?

ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల సమయంపై ఆంక్షలు విధించారు. మద్యం అమ్మకాలను తగ్గించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఏపీలో మద్యం షాపులన్నింటినీ ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పరిమితంగానే మద్యం విక్రయించాలనే నిబంధనల మేరకు విక్రయాలు తగ్గించేశారు.

అయితే ఎన్నికల్లో మద్యం కీలక ప్రభావం చూపుతుంది అనే విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు ప్రచారం నిర్వహించినా.. సమావేశాలు జరిపినా..డబ్బులతో పాటు మద్యం పక్కాగా ఉండాల్సిందే. లేకుంటే వారు తీవ్ర నిరాశ చెందుతారు.  ఈ సారి సభలకు పిలిచినా రారు. కానీ ఈసీ తాజా నిర్ణయంతో రాజకీయ నాయకులు తల పట్టుకుంటున్నారు.  ఇది వైసీపీ నేతల కంటే టీడీపీ వారికే పెద్ద సమస్యగా మారింది.

ఎలాగూ మద్యం షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో వైసీపీ నాయకులకు కావాల్సినంత మద్యం అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో ఇతరులకు మద్యం దొరక్కుండా వైసీపీ పక్కాగా ప్లాన్ చేసింది.  వాస్తవానికి డిస్టిలరీల్లో తయారైన మద్యాన్ని అక్కడి నుంచి డిపోల్లోకి అటు నుంచి షాపుల్లోకి, బార్లకు చేరుతుంది. కానీ ఇప్పుడు ఈ దారిని మూసేసి నేరుగా అధికార పార్టీ చెప్పిన వారికే దీనిని విక్రయిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి, చింతలపూడి వద్ద మద్యం లారీలను అధికారులు పట్టుకున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ పాటికే అధికార పార్టీ నేతల పాయింట్లకు మద్యం బాటిళ్లు చేరిపోయాయనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మద్యం షాపులను తన గుప్పిట్లోకి తెచ్చుకున్న ప్రభుత్వం తమ పార్టీకి మేలు చేసేలా వ్యవహరిస్తోంది. ఇది టీడీపీకి పెద్ద మైనస్ గా మారింది. దీంతో వారు ఇతర రాష్ట్రాలు మధ్యప్రదేశ్, తెలంగాణ, గోవాల నుంచి మద్యం తెచ్చుకుంటున్నారు.  కానీ వీటిని పోలీసులు దాడులు చేస్తూ పట్టుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓ వింత సమస్య ఎదురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: