చంద్రబాబు: ఆ 2 హామీలతో ఒక్కసారిగా సీన్‌ ఛేంజ్‌?

టీడీపీ అధినేత చంద్రబాబు తన వయసును లెక్క చేయకుండా.. ఎండ వేడిని సైతం పట్టించుకోకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. టీడీపీని కచ్చితంగా అధికారంలోకి తీసుకురావాలని.. వైసీపీని గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా తన సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

అయితే వైసీపీ ప్రభుత్వం తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మరోసారి గెలుపు తమదేనని ధీమాలో ఉంది. తాము అధికారంలోకి వస్తే వీటిని కొనసాగిస్తూనే ఇంతకు మించి సంక్షేమాన్ని మీ ఇంటికి తీసుకు వస్తామని చంద్రబాబు ప్రతి సభలోను ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ, వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇంటి వద్దే తీసుకునే అవకాశం లేకుండా నిమ్మగడ్డ అడ్డుకోవడంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వీటిని కవర్ చేసేలా చంద్రబాబు రెండు హామీలు ఇచ్చారు.

టీడీపీ అధికారంలోకి వస్తే మూడు నెలల పింఛన్ చెల్లించడానికి ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడితే.. తాము అధికారంలోకి రాగానే అంతా కలిపి ఒకేసారి ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. నెలకు రూ.4వేల చొప్పున అంతా కలిపి ఒకేసారి ఇస్తామన్నారు. జగన్ మాదిరి పెంచుకుంటూ పోతాం అనకుండా ఒకేసారి పెంచుతా అని చెప్పడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

అంతేకాక వాలంటీర్ వ్యవస్థ పై కూడా పెద్ద చర్చ సాగుతున్న నేపథ్యంలో.. దీంతో ఎన్నికల్లో ఈ అంశం తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన టీడీపీ అధినేత ఉగాది పురస్కరించుకొని ఒక సంచలన ప్రకటన చేశారు. వాలంటీర్ల గౌరవ వేతనం ఇప్పుడు ఇస్తున్న దానిని డబుల్ చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు మేం ఎప్పుడు అండగా ఉంటామని.. ఎట్టి పరిస్థితుల్లో వారిని తొలగించమని స్పష్టం చేశారు. మరి ఈ రెండు హామీలు ఎన్నికల్లో ప్రభావం చూపుతాయి అనడంలో సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి వైసీపీ వీటిని ఎలా తిప్పికొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: