పురందేశ్వరికి చంద్రబాబు షాక్‌ ఇవ్వబోతున్నారా?

రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి కూటమి కట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ కూటమి ఇంకా కుదుట పడినట్లు లేదు. వాస్తవంగా పై స్థాయిలో అగ్ర నేతలు కలిసిన అంత సులభంగా కింది స్థాయిలో కార్యకర్తలు కలవరు. ప్రస్తుతం పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కూటమిలో చిచ్చు మరింత  చెలరేగుతుంది తప్ప ఆరట్లేదు.

ఇప్పటికే టికెట్ల వ్యవహారంపై ఒకరిపై మరొకరు సోషల్ మీడియా ద్వారా విమర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కూటమి వల్ల ఆయా పార్టీలో సీనియర్లకు టికెట్ లేకుండా చేసింది. సుదీర్ఘకాలం పార్టీకి విధేయులుగా ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల టికెట్లను కోల్పోవాల్సి  వచ్చింది.  టీడీపీ , జనసేన లకు చెందిన పలువురు ఆశావహులు ఈ విషయంపై బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ప్రస్తుతం ఈ కూటమిలో మూడు పార్టీల మధ్య సమన్వయం కుదరడం లేదు.

కూటమిలో ఇంకా లుకలుకలు కొనసాగుతున్నాయనే దానికే తాజా ఘటనే నిదర్శనం. తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు తోసుకున్నారు. ఈ సమావేశానికి సాక్ష్యాత్తూ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సారథ్యం వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎన్నికల్లో ఆమె రాజమండ్రి లోక్ సభ నుంచి పోటీ చేస్తున్నారు.

ఈ సెగ్మెంట్ పరిధిలో వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజానగరం కూడా ఒకటి.  తాను పోటీ చేసే లోక్ సభ పరిధిలో ఆమె సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆమె ఎదురుగానే కూటమి నాయకులు గొడవ పడ్డారు. పురంధేశ్వరి ఫొటోను ముద్రించి ఉన్న ఫ్లెక్సీ ని సైతం చించి పక్కన పడేశారు. ఆమె కళ్లముందే ఇదంతా జరిగింది. వారించే ప్రయత్నం చేసినా.. సాధ్య పడలేదు. మొత్తం మీద టీడీపీ నేతలు ఆమె షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: