కడప ముక్కోణ పోరు: షర్మిళ సంచలనం సృష్టిస్తుందా?

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీ రాజకీయం రంజుగా మారుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన ఓ కూటమి కట్టగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ వామపక్షాలతో కలిసి మరో కూటమిగా వస్తున్నారు. జగన్ సింగిల్ గానే వస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిళ సరికొత్త అస్త్రంతో ప్రజల మధ్యకు వెళ్తున్నారు. గత రెండు ఎన్నికల్లో ఉనికిని కోల్పోయిన ఆ పార్టీకి జవ సత్వాలు నింపి ఊపిరి పోయాలని ఆమె భావిస్తున్నారు.

ఈ మేరకు ప్రచార పర్వంలోకి అడుగు పెట్టారు. తాను కడప ఎంపీ స్థానం నుంచి బరిలో ఉంటున్నట్లు షర్మిళ సంచలన నిర్ణయం ప్రకటించారు. అయితే ఈ నిర్ణయంతో కడప మీద ఎవరి పెత్తనం ఉంటుందో తేలబోతోంది. జగన్ ఆధిక్యమా.. షర్మిళ మార్కా?  తన సోదరుడు అవినాశ్ రెడ్డిని ఓడించడం ద్వారా కడపలో తమదే ఆధిపత్యం అని నిరూపించడానికి ఏపీసీసీ అధ్యక్షురాలు ఉవ్విళూరుతున్నారు. అవినాశ్ ద్వారా చెల్లికి చెక్ పెట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు.

అయితే ఆది నుంచి షర్మిళ వివేకా హత్య కేసులో గట్టిగానే మాట్లాడుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఆమె ఎన్నికల ప్రచారంలోకి దిగడంతో.. కచ్ఛితంగా వివేకా హత్య కేసు ఎజెండాగా ఎన్నికలకు వెళ్తారు. తనను కడప ఎంపీ గా చేయాలని బాబాయ్ వివేకా భావించారని.. అందుకే హత్యకు గురయ్యారని షర్మిళ ఇప్పటకే వ్యాఖ్యానించి సెంటిమెంట్ రగల్చే ప్రయత్నం చేస్తున్నారు.

అంటే ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్య కేసును ఎజెండాగా తీసుకున్నారు. షర్మిళ ప్రత్యర్థిగా ఉన్న అవినాశ్ రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాని నిందితుడిగా భావిస్తున్నారు. ఇది ప్రతికూల ఫలితం చూపే అవకాశం ఉన్నా జగన్ మొండిగా అవినాశ్ ను మళ్లీ బరిలో నిలిపారు. అయితే ఈ ఓట్ల చీలికతో తాము లాభపడొచ్చని టీడీపీ భావిస్తోంది. అయితే కడపలో ఎవరు విక్టరీ కొడతారో.. ఎవరు ఓటమి చెందుతారో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: