జగన్‌: చంద్రబాబు ఎత్తులతో భయం మొదలైందా?

ఇప్పటి వరకు అయితే సీఎం జగన్ ధైర్యంగానే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలు అన్నీ కలిసి వచ్చినా తాను ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయి అనే నమ్మకంతో ఉన్నారు.  తాను చేసిన పనులపై నమ్మకం ఉంది కాబట్టే ఒక్కడే మొండిగా ధైర్యంగా పోరాడుతున్నారు. కానీ ఇప్పుడు జగన్ లో భయం మొదలైనట్లు కనిపిస్తోంది. గత నెల వరకు సంక్షేమ పథకాలను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. వీటి పట్ల ప్రజలు కూడా సంతృప్తిగానే ఉన్నారు. కాకపోతే ఇక నుంచి తన పరిస్థితి ఏంటి అనే సందిగ్థంలో ఉండిపోయారు. అప్పటి వరకు ఎన్ని మంచి పనులు చేసినా.. చివరాఖరకు ఒక్క పని చేయకపోయినా ప్రజలు దానినే గుర్తు పెట్టుకుంటారు.

ఈ సమయంలో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇకమీదట కేంద్రం నుంచి సమయానికి నిధులు వస్తాయా రావా అనే భయం జగన్ లో ఉంది. ఈ నెల పింఛన్లు అయితే దాదాపు 80శాతం పూర్తి చేశారు. అంతా ప్రశాంతంగా సాగుతుంది. ఇక మిగతా పథకాల పరిస్థితి ఏంటి. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధుల విషయంలో టీడీపీ అడుగడుగునా అడ్డు పడుతుంది. ఇళ్లకు సంబంధించిన బిల్లులు ఈ నెలలో పంపిణీ చేద్దామని వైసీపీ భావించింది. కానీ టీడీపీ అధినేత వీటికి అడ్డుపడకుంటా ఉంటారా అంటే ప్రశ్నార్థకమే.

ఒకవేళ చంద్రబాబు ఆపించారు అన్నా.. సీఎంగా ఉండి ఎందుకు చేయించలేకపోయారు. అంటే టీడీపీ కూటమికే లాభం చేకూరుతుంది. మరోవైపు ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న చంద్రబాబు కేంద్రం అండతో వైసీపీ అనుకూల అధికారులను విధుల నుంచి పక్కకి తప్పించి తన అనునూయులను పెట్టించుకుంటున్నారు. ఇది జగన్ కు మింగుడు పడని విషయం. అధికారుల బదిలీ జరిగిన ప్రతిచోటా కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరి వీటిని జగన్ ఏ విధంగా అడ్డుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: