జగన్ గ్యాంగ్ ను ఠారెత్తిస్తున్న "వివేకం" వ్యూస్ లెక్కలు?

అగ్రతారలు లేరు.. దర్శకుడి పేరు తెలియదు. ప్రచారం కోసం పైసా ఖర్చు చేయలేదు. అయితేనేం ఏకంగా ఈ  సినిమా అధికార పార్టీకి ముచ్చెటమలు పట్టిస్తోంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోను సోషల్ మీడియాలోను, జనాల చర్చల్లో భాగమైన ఆ చిత్రం మాజీ ఎంపీ దివంగత వివేకానంద రెడ్డి బయోపిక్.

వివేకం చిత్రం యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. స్ర్టీమింగ్ మొదలైన దగ్గర నుంచి తొలి రోజే పది లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌ ఈ సినిమాకు వస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో కూడా కొన్ని సన్నివేశాలను వైరల్ చేస్తున్నారు. మేధావులనే కాదు సామాన్య జనాలను సైతం ఈ సినిమాను ఆకర్షించడం పట్ల వైసీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.  అప్రమత్తమైన వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఓటీటీలో దీని విడుదల అడ్డుకున్నారు.

దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో విడుదల చేశారు. వీటి లింక్ లను తొలగిస్తూ ప్రభుత్వం పలు చర్యలను చేపడుతుంటే వందల కొద్దీ లింకులు పుట్టుకుస్తున్నాయి. ప్రస్తుతం యూ ట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. రోజు రోజుకి ఈ సినిమాను చూసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇది ప్రతిపక్ష టీడీపీకి లాభించేలా ఉండటంతో వైసీపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది.

ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ కంటెంట్ ను తొలగిస్తున్నా.. నెటిజన్లు పైరవీ లింకుల ద్వారా డిజిటల్ ప్లాట్ ఫారాల ద్వారా వీక్షకులకు అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు సంచలనాల దర్శకుడు ఆర్జీవీ వల్ల కూడా కానిదీ వివేకం దర్శకుడి వల్ల అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా మొత్తం వివేకానంద రెడ్డి హత్య చుట్టూ జరిగిన అంశాలనే తెరకెక్కించారు.  సీబీఐ ఛార్జిషీటులో పొందుపరిచిన అంశాలనే సినిమాలో తెరకెక్కించారు.  సీఎం జగన్, ఆయన సతీమణి భారతీ, షర్మిళ, అవినాశ్ రెడ్డి, సునీతా రెడ్డి ఇలా పేర్లను నేరుగా వాడేశారు. దీంతో ఈ సినిమా ఏపీ ఎన్నికల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: