చంద్రబాబు: ఫించన్ల పాపం.. కూటమికి చేటు చేస్తుందా?

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పింఛన్లు వారి ఇంటికే వచ్చి చేరుతాయి. పంచాయతీ కార్యాలయాల వద్ద క్యూ లైన్లో పడిగాపులు.. మొదటి వారం వరకు పింఛన్ డబ్బుల కోసం ఎదురు చూపులు ఉండవు. ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళల వద్దకు వచ్చి వాలంటీర్లు పింఛన్లు ఇచ్చి వెళ్తుంటారు. ఈ ప్రక్రియ నాలుగున్నేళ్లకు పైగా సాగింది. దీంతో పండుటాకులు, వికలాంగుల మోములో సంతోషం వెల్లివిరిసేది.

కానీ వార్డు వాలంటీర్ల విషయంలో ఇంటింటికీ తిరిగి పింఛన్ పంపిణీ చేయొద్దంటూ ఈసీ ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో సచివాలయాల వద్ద పెన్షన్లు అందించేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీంతో సచివాలయాల వద్దకు వృద్ధులు, వికలాంగులు, భారీగా చేరుకొని నగదు స్వీకరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలు ఎక్కువ అయ్యాయి. ఎండవేడిమి తీవ్రమైంది. దీంతో పింఛన్ కోసం వచ్చిన పండుటాకులు అల్లాడుతున్నారు. దీంతో వారంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఈ క్రమంలో పలువురు తీవ్ర అస్వస్థతకు గురువుతున్నారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే కృష్ణా, తిరుపతి జిల్లాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాలో పెన్షన్ డబ్బుల కోసం వెళ్తూ వడదెబ్బ తగిలి వజ్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. తిరుపతి జిల్లా ఎర్రవారి పాలెం మండలం లో సచివాలయం వద్దకు వెళ్లిన వృద్ధుడు షేక్ ఆసం వడ దెబ్బ తగిలి మృతి చెందాడు.

అయితే ఈ చావులకు కారణం ప్రతిపక్ష పార్టీలేనని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వార్డు వాలంటీర్లపై ఈసీ ఆంక్షలకు టీడీపీయే కారణమని విమర్శిస్తున్నారు.  ఈ వృద్ధుల చావులకు… పండుటాకులు పడుతున్న ఇబ్బందులకు బాధ్యులు ఎవరనీ పలువురు ప్రశ్నిస్తున్నారు.  తిలాపాపం తలా పిడికెడు అన్న విధంగా ఈ పాపంలో అన్ని వ్యవస్థల పాత్ర ఉందని.. మండుటెండలో వృద్ధులను నిల్చొబెట్టిన పాపం ఎవర్నీ వెంటాడుతుందో చూడాలని పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: