కేసీఆర్‌: పూర్తిగా బద్‌నాం చేసేదాకా రేవంత్‌రెడ్డి వదలడా?

అధికారాంతమున చూడాలి అయ్యవారి చిత్రాలు అనే సామెత బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు బాగా సరిపోతుంది. ఆయన పదవిలో ఉన్న సమయంలో 2014, 2018 లో ప్రతిపక్షాలను ఏ విధంగా పార్టీలో చేర్చుకున్నది, ఏ విధంగా వ్యవస్థలతో ఆడుకున్నది, ఏ విధంగా ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసింది పూర్తిగా  మర్చిపోయారు. తన పాలన మొత్తం ప్రజాస్వామ్య బద్ధంగా సాగినట్లు.. తెలంగాణలో అన్ని రకాల వ్యవస్థలు సక్రమంగా పనిచేసినట్టు మాట్లాడుతున్నారు.

ఆయన పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్ని లోపాలు జరిగినట్లు ఎవరికీ తెలియదు. దీనిపై ఏ పేపర్ కానీ, టీవీ ఛానళ్లు కానీ దృష్టి సారించకలేకపోవడం చూస్తుంటే ఆయన మీడియా పై ఎంత పట్టు సాధించారో అర్థం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కానీ వెలుగు చూడలేదు కేసీఆర్ చేసిన అరాచకాలు.

విద్యుత్తుపై శ్వేత పత్రం విడుదల చేసే వరకు బంగారు తెలంగాణలో కరెంట్ లెక్కల గురించి తెలియలేదు సగటు తెలంగాణ ప్రజలకు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్తితి కూడా అంతే. సాగునీటి రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలింపు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  అసలు పాలన అంటే తెలంగాణ చూసే నేర్చుకోవాలి.   దేశ రాజకీయాలను శాసించి.. తెలంగాణ నమూనాగా భారతదేశాన్ని తీర్చిదిద్దుదాం అని గొప్పలకు పోయారు.

తీరా ఇప్పుడు చూస్తే ప్రతి రంగంలోని లోపాలే కనిపిస్తున్నాయి.  తాజాగా సీఎం కేసీఆర్ రైతులను పరామర్శించారు. సూర్యాపేటలో ప్రెస్ మీట్ నిర్వహించి కరెంట్ పై పలు వ్యాఖ్యలు చేశారు.  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బదులిస్తూ కేసీఆర్ సెంట్రల్ గ్రిడ్ లో తెలంగాణను చేర్చలేదు అని పేర్కొన్నారు.  ఇందులో చేరితే సెంట్రల్ గ్రిడ్ లో చేరిన ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తు డిమాండ్ ఎక్కువ అయితే కేంద్రం తెలంగాణాకి సరఫరా చేస్తుంది. ఒకవేళ మన దగ్గర మిగులు విద్యుత్తు ఉంటే ఇతర రాష్ట్రాలకు మనం అమ్ముకోవచ్చు. కానీ ఇందులో చేరేందుకు కేసీఆర్ ససేమిరా అన్నారట.  ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.  కనీసం దీనిపై మీడియా కూడా వార్తలు రాయలేకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: