పవన్ కల్యాణ్‌: ఆ ఇద్దరినీ వణికించేస్తున్నాడుగా?

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి సీఎం జగన్ ఎన్నికల్లో అందరి కంటే ముందున్నారు. విడతల వారీగా అయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అభ్యర్థుల తంతును పూర్తి చేశారు. కూటమిలో ఆలస్యంగా చేరిన బీజేపీ కూడా తమ అభ్యర్థులను ఒకే సారి పూర్తి చేసింది.

ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయానికొస్తే ఇచ్చిందే 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు. ఇందులో పద్దెనిమిది ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపి మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారు. దీనిపై పవన్ కల్యాణ్ వ్యూహం ఎలా ఉందో కానీ ఈ స్థానాల్లో అభ్యర్థుల్లో మాత్రం వణుకు మొదలైంది. అసలు మాకే కేటయిస్తారా లేక హ్యాండిస్తారా అనే సందిగ్ధంలో ఆయా నియోజకవర్గ ఆశావహులు తెగ ఆందోళన చెందుతున్నారు.

మచిలీ పట్నం ఎంపీ సీటు విషయానికొస్తే అక్కడ సిట్టింగ్ ఎంపీగా బాల శౌరి ఉన్నారు. ఆయనకు ఈ సారి వైసీపీ సీటు నిరాకరించడంతో జనసేన గూటికి చేరిపోయారు. ముందు నుంచి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారని అనుకున్నారంతా. కానీ ఆ స్థానానికి నాగబాబు లేదా వంగవీటి రాధా పేరు వినిపిస్తుండటంతో ఆయనలో ఆందోళన మొదలైంది.

మరో అసెంబ్లీ స్థానం విశాఖ సౌత్.  ఈసీటును వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆశించారు. కానీ జగన్ నిరాకరించడంతో ఆయన పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. తీరా ఇప్పుడు పవన్ ఆ స్థానంలో వంశీకృష్ణ పేరు ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచారు. దీంతో ఆయన కూడా కొంత కలవరపాటుకు గురువుతున్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఈ ఇద్దరికీ పవన్ హ్యాండ్ ఇస్తే తమ భవిష్యత్తు ఏంటని వీరు ఆందోళన చెందుతున్నారంట. ఊరించి ఆఖరిలో సీటు ఇచ్చినా ప్రచారం లో వెనుకపడతామని.. సీటు ఇవ్వకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడుతుందని మదన పడుతున్నారని సమాచారం. మరి పవన్ వీరిద్దరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: