హైదరాబాదీలకు గుడ్‌న్యూస్‌.. పార్కింగ్‌ కష్టాలకు చెక్‌?

హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్‌తో పాటు పార్కింగ్‌ కూడా ఓ ప్రధాన సమస్యగా మారింది. అందుకే గ్రేటర్ హైదరాబాద్‌లో వానహదారులు, ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులను తొలగించడానికి ప్రత్యేకంగా పార్కింగ్ పాలసీని రూపొందించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ తో పాటు భారీ వాహనాలు ఎక్కడ ఎక్కడ పార్క్ చేయడానికి అవకాశం ఉందో అలాంటి అనువైన స్థలాలను గుర్తించనున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటికే స్థలాలు గుర్తించినప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడం మూలంగా పార్కింగ్ వినియోగించుకోవడం లేదు.

ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఫోర్ వీలర్ పార్కింగ్, టూ వీలర్ కోసం ప్రత్యేక స్థలాలు గుర్తించనున్నారు. హైదరాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు ఆయా ప్రాంతాల్లో వాహనదారులు పార్కింగ్ చేసుకునేలా అందుబాటులో ఉన్న పార్కింగ్ స్థలాల వివరాలతో ప్రత్యేక పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా గుర్తించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా నగరంలో ఖాళీగా ఉన్న ప్రైవేటు స్థలాల యజమానులు పార్కింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు వచ్చే పక్షంలో పాటించాల్సిన నియమ నిబంధనలు తయారు చేయనున్నారు.

ముఖ్యంగా మెయిన్ రోడ్డు తో పాటు ట్రాఫిక్ రద్దీగా ఉండే కాలనీ రోడ్లను గుర్తించి అనువైన స్థలలాను గుర్తించనున్నారు. కమర్షియల్ మాల్స్ వద్ద కూడా వాహన పార్కింగ్ సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. పార్కింగ్ స్థలాల వద్ద ప్రకటనల ద్వారా బల్దియాకు ఆదాయం పెంచడం కోసం ప్రత్యేకంగా దృష్టి సారించాలని జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ ఇటీవల అధికారులను కోరారు. కమిషనర్ రోనాల్డ్ రాస్ ఈ అంశంపై తాజాగా సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రణాళిక విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన ఆర్గనైజింగ్ పార్కింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. మరి ఈ పార్కింగ్‌పై కొత్త విధానం సాధ్యమైనంత త్వరలో రూపొందించి అమలు చేయాలని హైదరాబాద్‌ వాసులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: