బడాకంపెనీల ఎన్నికల బాండ్ల వెనుక అసలు రహస్యం?

సుప్రీం కోర్టు అనేక సార్లు తలంటిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బయట పెట్టింది. కాకపోతే ఇందులో దాగుడు మూతలు ఆడింది. ఏ కంపెనీ. ఏ రాజకీయ పార్టీకి.. ఏ స్థాయిలో నిధులు ఇచ్చింది అనే విషయాలను కనుక్కోలేని విధంగా సమాచారం ఇచ్చింది.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన రెండు జాబితాలను ఎన్నికల సంఘం సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది.  

అయితే అందులో ఒక జాబితాలో కంపెనీలు ఎంత విలువైన బాండ్స్ కొన్నాయో వివరాలున్నాయి. మరో జాబితాలో రాజకీయ పార్టీలకు ఎంత విలువైన బాండ్స్ అందాయో వివరాలున్నాయి. అయితే ఈ రెండు  బాండ్ల సీరియల్ నెంబర్లను ఎస్బీఐ ప్రస్తావించలేదు. ఈ ప్రకారం ఎస్బీఐ నుంచి కొనుగోలు చేసిన బాండ్లు ఏ పార్టీకి ఎంత అందాయో తెలుసుకునే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

అయితే పార్టీలకు బాండ్ల రూపంలో డబ్బులివ్వడం.. దేవుని హుండీలో కానుక వేయడం దాదాపు ఒకటే అని పలువురు పేర్కొంటున్నారు. ఇచ్చిన దాత కి తప్ప..వేసిన భక్తుడికి తప్ప ఎంత ఇచ్చారో.. ఎంత కానుక వేశారో ఎవరికీ తెలియదు. అలాగే బాండ్ల విషయంలోను దీనిపై స్పష్టత లేదు.

ఈ బాండ్లపై పలువురు విభిన్నంగా స్పందిస్తున్నారు. గతంలో ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చేవారో ఎవరికీ చెప్పేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతున్నారని ప్రశ్నిస్తున్నారు. పైగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షంతో పోల్చుకంటే తక్కువగానే విరాళాలు వస్తాయనే చెబుతున్నారు. అధికార పార్టీతో ఉండే లావాదేవీలు, ఇతర వ్యవహారాల వల్ల వీటికి ఎక్కువగా ఫండింగ్ ఇస్తుంటారు ఇది సహజంగానే జరిగేదే అని కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొంటున్నారు. పైగా ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారో చెబితే భవిష్యత్తులో వారిపై కక్ష గట్టి వారిపై ప్రతీకార చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. బాండ్ల ను చట్టబద్ధంగా.. పన్నులు కడుతూ తీసుకుంటుంటే కావాలనే ఏదో జరిగిపోతుంది అనే తరహాలో అపోహలు సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: