పవన్‌కు చివరకు మిగిలేదని.. ఆ ఒక్కటేనా?

ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ది ఓ భిన్నమైన సిద్ధాంతం. కుల మతాలతో సంబంధం లేని రాజకీయాలు చేయడమే తన లక్ష్యమని.. పాతికేళ్ల భవిష్యత్తు కోసమే తాను రాజకీయాలు చేస్తున్నట్లు పవన్ పలు సందర్భాల్లో ప్రకటించారు. జనసేనకు పటిష్ఠమైన విధానాలు ఉన్నాయి. వీటి కోసమే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు.

అయితే  సీట్ల పొత్తులో భాగంగా బాగా తగ్గినవి జనసేనకే. 2019లో అరశాతం ఓట్లు వచ్చిన బీజేపీకి పది అసెంబ్లీ సీట్లు, ఆరు ఎంపీ స్థానాలు అయితే.. ఆరు శాతం ఓటు బ్యాంకు ఉన్న జనసేనకి దక్కింది రెండు ఎంపీ సీట్లు. 21 ఎమ్మెల్యే స్థానాలు. తద్వారా తన రాజకీయ అవకాశాలను పవనే నాశనం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన సమయంలో పొత్తు టీడీపీతో పెట్టుకొని చంద్రబాబు పంచనకు చేరారు.

దీంతో సీఎం పదవి చేపట్టే అవకాశం మరో పదేళ్ల వరకు రాదు. ఆ తర్వాత ఆయనకు ఎవరు ఇస్తారో కూడా తెలియదు. టీడీపీ కోసం కొన్ని స్థానాలను దక్కించుకున్నారు. మళ్లీ బీజేపీ కోసం మరికొన్ని సీట్లు తగ్గించుకున్నారు. తగ్గుతూ పొతుంటే గెలుపు ఎలా దక్కుతుందని ఆ పార్టీ నాయకులే ప్రశ్నిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గట్టిగా పట్టుబడితే నలభై స్థానాలు వస్తాయని జనసైనికులు భావించారు. కానీ ఇందులో సగమే దక్కాయి. రాజకీయాల్లో అవకాశాలను అందుకోవాలని వాటిని వేటాడాలి.

రాజకీయాల్లో త్యాగాలు చేస్తూ ఉంటే త్యాగరాజు అనే పేరు తప్ప మరేదీ మిగలదు. పవన్ ని ఒప్పించి సీట్లు తగ్గించ వచ్చు కానీ ఆయన వెనుక ఉన్న వారిని ఆకాంక్షలను గుర్తించకపోతే ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు సూచిస్తున్నారు. పవన్ తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రానికి ఒక ప్రత్యామ్నాయం అంటూ లేకుండా పోయింది. ఫలితం ఏపీ ఇద్దరి వ్యక్తుల మధ్య బందీ అయింది. పవన్ తీసుకున్న నిర్ణయాలతో ఆయన పార్టీకి కానీ.. వ్యక్తిగతంగా కానీ.. రాష్ట్రానికి గానీ ఏమైనా ఉపయోగం ఉందా. దీనిపై ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: