టీడీపీ, బీజేపీ చేతిలో పవన్‌ బకరా అయ్యారా?

రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన…పొత్తుల్లో భాగంగా 21 సీట్లు.. 2 లోక్ సభ స్థానాలు దక్కించుకుంది. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటుకు  సంబంధించి ఏర్పాటు చేసిన సమావేశంలో 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత ప్రకటించారు. దీంతో కొంతమంది జనసైనికులు విస్మయం చెందారు. మరీ ఇంత తక్కువ సీట్లా అని పెదవి విరిచారు.

తాజాగా ఈ కూటమిలోకి బీజేపీ వచ్చి చేరడంతో మరో మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానాన్ని జనసేన పొత్తులో భాగంగా కోల్పోవాల్సి వచ్చింది. అయితే టీడీపీ మాత్రం ముందుగా ప్రకటించిన 145 స్థానాల నుంచి మెట్టు దిగకపోవడంతో జనసైనికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ని సీట్ల విషయంలో తగ్గించి బలి పశువును చేశారు అని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. దీంతో వారంతా టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయంలో టీడీపీ తప్పేం లేదని విశ్లేషకులు జనసేనకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు. ఆది నుంచి గౌరవ ప్రదమైన స్థానాలు అంటున్నారు తప్ప ఆ సంఖ్యను కచ్చితంగా చెప్పకపోవడమే జనసైనికుల్లో ఆగ్రహానికి కారణంగా వారు పేర్కొంటున్నారు. ముందు 24 అన్నారు. ఆ తర్వాత 21కి పరిమితం చేశారు. ఇందులో టీడీపీ తప్పేం లేదని.. ఆయా పార్టీ లెక్కల్లో అది బలంగానే ఉంది. కానీ దీనిని అర్థం చేసుకోవడంలో పవన్ విఫలమయ్యారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ సీట్ల తగ్గుదలను చూడొద్దని  ఆ పార్టీ నాయకులు సూచిస్తున్నారు . కానీ కార్యకర్తలు మాత్రం సీట్ల తగ్గుదల ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తోందని మదన పడుతున్నారు. కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని వారంతా భావించారు. కానీ ఇంత తక్కువ సీట్లతో ఈ రెండింటిలో ఆయన ఏమీ కారని తేలిపోయింది. మరి ఇప్పుడు పవన్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తారని వారంతా ఆలోచనలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: